Andhra Pradesh State Road Transport Corporation (APSRTC) has given good news to senior citizens. APS RTC, which is introducing many plans and schemes to attract passengers besides generating income, has recently announced many concessions for senior citizens. It has been said that showing a digital Aadhaar card will now be enough to get discount on bus tickets. APS RTC has announced that the digital Aadhaar card is also considered as an identity card.
Also, it has been announced that 25 percent discount will be given to senior citizens on ticket prices. It has been announced that senior citizen ID card, Aadhaar card, PAN card, passport, voter ID card and ration card will be considered as identity cards for this concession. Along with these, RTC ED KS Brahmananda Reddy has issued an order that the digital Aadhaar card is also included in this list.
Telugu Version
సీనియర్ సిటిజన్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రావాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) శుభవార్తను అందించింది. ఆదాయాలను సమకూర్చుకోవడంతో పాటు ప్రయాణికులను ఆకర్షించేందుకు ఎన్నో ప్లాన్స్, పథకాలను ప్రవేశపెడుతోన్న ఏపీఎస్ ఆర్టీసీ.. తాజాగా సీనియర్ సిటిజన్లకు పలు రాయితీలను ప్రకటించింది. బస్ టికెట్లలో రాయితీ పొందేందుకు ఇకపై డిజిటల్ ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుందని పేర్కొంది. ఈమేరకు డిజిటల్ ఆధార్ కార్డును కూడా గుర్తింపు కార్డుగా పరిగణిస్తున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ ప్రకటించింది.
అలాగే, టికెట్ల ధరల్లో సీనియర్ సిటిజన్లకు 25 శాతంమేర రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ రాయితీ కోసం సీనియర్ సిటిజన్ ఐడీ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ కార్డు, రేషన్‌కార్డులను గుర్తింపు కార్డులుగా పరిగణిస్తామని ప్రకటించింది. వీటితోపాటు డిజిటల్ ఆధార్ కార్డును కూడా ఈ లిస్టులో చేర్చుతున్నట్లు ఆర్టీసీ ఈడీ కేఎస్ బ్రహ్మానందరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.