Alert for residents of Bhagyanagar Yellow alert issued for heavy rains for another three days

Heavy rain has once again flooded Hyderabad. The city was drenched by two hours of continuous rain. The residents of the city faced severe problems due to the inundation of water in the roads and low-lying areas. Heavy rain.. that too as it was in the evening.. the motorists experienced hell. Hyderabad suddenly turned into a sea yesterday evening. The city of Bhagya was shaken by the sudden downpour. On the one hand, while the yellow alert continued, it rained for two hours all over the city. Hyderabad was battered by thunder and lightning rain. The streets of Bhagyanagar resemble the Mahasandra. Roads have become reservoirs. All the roads in the Secretariat area in the heart of Hyderabad were flooded.

From Kukatpally to Uppal, the rain has created havoc. If five centimeters of rain fell within two hours in many parts of Hyderabad, it can be understood in what range it has hit. After two hours of rain in Hyderabad, water was visible everywhere. The people were in a hurry to take a step. Gajagaja trembled wondering where the manhole would be. In that too.. As it was time to go from offices to homes, there was a traffic jam in many areas. Due to heavy rain, the traffic in the IT corridor has come to a standstill. Motorists suffered hell. Especially.. in Banjara Hills, Jubilee Hills, Panjagutta and Khairatabad areas, vehicles were stuck for kilometers. It can be said that the condition of motorists going towards Jubilee Hills Checkpost from Hitech City is indescribable. Alerted by this, the traffic police diverted the vehicles in some areas.

An old building collapsed in Hyderabad's Yakatpura due to heavy rain. A dome belonging to the 400-year-old Qutubshahi Masjid collapsed due to lightning in Langarhouz, and cracks appeared in the rest of the area. Knee-deep water at Nampally Yusufin Dargah. In Attapur, a person had a lucky escape from lightning. And.. Heavy flood water entered some low-lying houses in Musi catchment areas. As heavy flood water is coming to Musi, the people of the low-lying areas are living in fear. Meanwhile, Moosy flood is flowing on the roads in Musarambagh and Chadarghat areas. The authorities have taken precautionary measures to avoid accidents. Traffic has been stopped in those areas. All in all.. before the city dwellers could get some relief in the morning.. heavy rain hit in the evening. As a result.. within two hours Hyderabad faced the sea.

Telugu version

హైదరాబాద్‌ను భారీ వర్షం మరోసారి ముంచెత్తింది. రెండు గంటలపాటు కురిసిన వర్షంతో నగరం తడిసి ముద్దయింది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలలో నీరు చేరడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం.. అది కూడా సాయంత్రం కావడంతో.. వాహనదారులు నరకం అనుభవించారు. నిన్న సాయంత్రం హైదరాబాద్ ఒక్కసారిగా సముద్రంలా మారింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి భాగ్య నగరం అల్లాడిపోయింది. ఒకవైపు ఎల్లో అలర్ట్ కొనసాగుతుండగానే నగరమంతటా రెండు గంటల పాటు వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో హైదరాబాద్ అతలాకుతలమైంది. భాగ్యనగర్ వీధులు మహాసంద్రాన్ని పోలి ఉంటాయి. రోడ్లు జలాశయాలుగా మారాయి. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న సచివాలయ ప్రాంతంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి.

కూకట్‌పల్లి నుంచి ఉప్పల్‌ వరకు వర్షం బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో రెండు గంటల్లోనే ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసిందంటే అది ఏ రేంజ్ లో తగిలిందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్‌లో రెండు గంటలపాటు కురిసిన వర్షంతో ఎక్కడ చూసినా నీరు కనిపించింది. ఒక అడుగు వేయాలని జనం తొందర పడ్డారు. మ్యాన్ హోల్ ఎక్కడ ఉంటుందోనని గజగజ వణికిపోయింది. అందులోనూ.. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. భారీ వర్షం కారణంగా ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ స్తంభించింది. వాహనదారులు నరకయాతన అనుభవించారు. ముఖ్యంగా.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్ ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. హైటెక్ సిటీ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వైపు వెళ్లే వాహనదారుల పరిస్థితి వర్ణనాతీతం అని చెప్పొచ్చు. దీంతో అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు కొన్ని ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లించారు.

హైదరాబాద్‌లోని యాకత్‌పురాలో భారీ వర్షం కారణంగా పాత భవనం కుప్పకూలింది. లంగర్‌హౌజ్‌లో పిడుగుపాటుకు 400 ఏళ్ల నాటి కుతుబ్‌షాహి మసీదుకు చెందిన గోపురం కూలిపోయి, మిగిలిన ప్రాంతాల్లో పగుళ్లు ఏర్పడ్డాయి. నాంపల్లి యూసుఫిన్ దర్గా వద్ద మోకాళ్లలోతు నీరు. అత్తాపూర్‌లో పిడుగుపాటు నుంచి ఓ వ్యక్తి అదృష్టవశాత్తూ బయటపడ్డాడు. ఇక.. మూసీ పరివాహక ప్రాంతాల్లోని కొన్ని లోతట్టు ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. మూసీలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా మూసారాంబాగ్, చాదర్ ఘాట్ ప్రాంతాల్లో రోడ్లపై మూసీ వరద ప్రవహిస్తోంది. ప్రమాదాలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. మొత్తానికి.. నగరవాసులకు ఉదయం కాస్త ఊరట లభించకముందే.. సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఫలితంగా.. రెండు గంటల్లోనే హైదరాబాద్ సముద్రాన్ని తలపించింది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens