AIKON CORPORATE SERVICE LLP ను జాతీయ.. అంతర్జాతీయ స్థాయిలో అన్ని ప్రాంతాలకు సంబంధించిన మన కుటుంబాలను..సమూహాలను ఒక్కటిగా కలిపి మహాబలిజ (తెలగ, కాపు, తూర్పుకాపు, బలిజ, ఒంటరి, మున్నరు కాపు మరియు అనేక కాపు ఉప కులాలు) అనే పెద్ద కుటుం బంగారూపొందించి మనలో అందరి మధ్య సామాజిక సామరస్యం , మరియు సహకారాలను పెంచుతూ విద్య మరియు వ్యాపార అవకాశాలకు మార్గదర్శకత్వం చేసి మన కుటుంబాల సమూహాల ఆర్థిక సమస్యలను పరిష్కరించే మరియు పెంపొందించే లక్ష్యం తో 2015లో ఏర్పాటు చేయబడిన ఐకాన్ సంస్థ చే ఏర్పాటు గావించినది.
ఐకాన్ లక్ష్యాలు
- వృత్తిపరమైన విభాగాలను ఏర్పాటు చేయడం .
- ప్రత్యక్ష సమావేశాల ద్వారా పరస్ప సహకారం పెంపొందించే మార్గాలను సూచించడం .
- యువతకు వ్యా పారవేత్తలకు అవకాశాలు అందించే వ్యాపార వేదికలు ఏర్పాటు చేయడం .
- నాయకత్వ గుణాలను పెంపొందించే ప్రత్యే కకార్యక్రమాలు నిర్వహించడం .
ఇలా మన సమూహాలలో కుటుంబాలలో అందరి తో కలిసికట్టుగా ముందుకు సాగడం ఐకాన్ సిద్ధాంతం ఐకాన్ కార్యకలాపాలు 65 విభాగాలలో విస్తరిస్తూ ఎన్నో ప్రధాన కార్యకలాపాలు ఇప్పటికే నిర్వహించింది. ఇవి మన రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాకుండా విదేశాలలో కూడా విస్తరించాయి ఆయా విభాగాల సపోర్టుతో ఎన్నో కొత్త అవకాశాలు పుట్టుకొచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లోనేకాకుండా దక్షిణ భారతదేశం లోని ఇతర ప్రాంతాలలోనూ ఐకాన్ ప్రభావం ఇప్పుడు ప్రస్ఫుటంగా కనిపిస్తుం ది, ప్రత్యే కంగా మేధావులను కలుపుతూ దాదాపు 25 వేల మందికి పైగా వ్యక్తులు వారి వారి సంస్థలు ఐకాన్లో భాగస్వామ్యం అయ్యారు.
ఐకాన్ 2024 లో ఇప్పటివరకు సాధించిన కొన్ని ఘనతలు
- వైజాగ్లో హ్యాం డ్లూమ్ శారీ వాక్. ఈ కార్యక్రమం హ్యాండ్లూమ్ పరిశ్రమ అభివృద్ధికి మరియు దీనిలో భాగస్వామ్యమైన మన కుటుంబసభ్యుల అభివృ ద్ధికి తోడ్పడుతూ ప్రజలకు చేరువయ్యింది
- హైదరాబాదులో నిర్వహించిన 1000లీడర్స్ మీట్ అనేక మంది క్రీడాకారులు. వ్యాపారవేత్తలు లీడర్లతో వారు సాధించిన విజయాలతో వారి అనుభవాలతో నిర్వహించిన ఈ కార్యక్రమం వేలాది మందికి స్ఫూర్తినిచ్చింది
- నాయకత్వ శిక్షణ పాఠశాల. మన సమూహాలలో కుటుంబాలలో నాయకత్వ గుణాలు పెంచే కార్యక్రమాన్ని ఐకాన్ నిర్వహించింది
- ఐకాన్ గురించి చెప్పాలంటే సమాజంలో అందరినీ కలుపుతూ ఒక కుటుంబంలా పనిచేస్తూ యువతకి మార్గదర్శనం చేస్తూ. సామాజిక సామరస్యం కోసం ప్రయత్నిస్తూ పరస్పర సహకారం తో మనం దరినీ ఒకే వేదిక పైకి తీసుకునివస్తుంది