Saroj, a woman from Faridabad, Haryana, has been suffering from severe abdominal pain and bloating for the past few years. Many medicines and hospitals were turned to reduce it. As there was no use at all, she finally went to Om Hospital in Bharatpur, Rajasthan. The doctors there conducted some tests on the woman.
Scanning was also done. After checking the reports, it was found that there was a 4 kg tumor in her stomach. After an hour and a half surgery, the doctors removed the tumor. Doctors said that after the operation, the woman's health deteriorated. After she recovered completely, she was discharged.
Telugu version
హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన సరోజ్ అనే మహిళ గత కొన్నేళ్లుగా తీవ్రమైన కడుపునొప్పి, ఉబ్బరంతో బాధపడుతోంది. అది తగ్గేందుకు ఎన్నో మందులు, ఆసుపత్రులు తిరిగింది. ఏమాత్రం ఉపయోగం లేకపోవడంతో.. చివరికి రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఉన్న ఓం ఆసుపత్రికి వెళ్లింది.
అక్కడున్న డాక్టర్లు సదరు మహిళకు కొన్ని పరీక్షలు నిర్వహించారు. స్కానింగ్ కూడా చేశారు. ఇక వచ్చిన రిపోర్ట్స్‌ను చెక్ చేయగా.. ఆమె కడుపులో 4 కేజీల కణితి ఉన్నట్లు గుర్తించారు. సుమారు గంటన్నరకు పైగా శస్త్రచికిత్స నిర్వహించి ఆ కణితిని తొలగించారు వైద్యులు. కాగా, ఆపరేషన్ అనంతరం సదరు మహిళ ఆరోగ్యం కుదుటపడిందని.. పూర్తిగా కోలుకున్నాక డిశ్చార్జ్ ఆమెను డిశ్చార్జ్ చేశామని డాక్టర్లు చెప్పారు.