What is the revenue of railways due to ticket cancellation? What does the Union Minister say about this?

In a written reply to Parliament, Railway Minister Ashwini Vaishnav said that the Indian Railway Catering and Tourism Corporation (IRCTC) is charging a convenience fee from passengers who book online reserved e-tickets through the e-ticketing platform. He said Rs 1,949.98 crore was collected from 2019-20 to December 2022 when railway travel tickets including e-tickets were cancelled. He also said that in the financial year 2021-22, Rs.694.08 crores have been received due to the cancellation of e-tickets at the counter. He said that in the current financial year (2022-23) till December 2022, Rs.604.40 crore has been received through cancellation of tickets.

Also, if a train ticket is booked through net banking or debit card or credit card for traveling in air-conditioned class and it is canceled later, a charge of Rs.30 per ticket will be charged, he said. He said that if the ticket booked through UPI (Unified Payments Interface) is cancelled, Rs. 20 will be charged for each ticket. If you want to cancel a ticket taken for traveling in non-AC classes, if you book it through net banking or debit card or credit card, you will be charged at the rate of Rs.15 per ticket, he said. They said that they are charging Rs.10 per ticket to cancel the ticket booked through UPA.

Telugu version

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) పార్లమెంటుకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో, ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) ఈ-టికెటింగ్ ప్లాట్‌ఫాం ద్వారా ఆన్‌లైన్ రిజర్వ్‌డ్ ఈ-టిక్కెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికుల నుంచి కన్వీనియెన్స్ ఫీజును వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ-టిక్కెట్లతో సహా రైల్వే ప్రయాణ టిక్కెట్లను రద్దు చేసుకున్నపుడు 2019-20 నుంచి 2022 డిసెంబరు వరకు రూ.1,949.98 కోట్లు వసూలు చేసినట్లు చెప్పారు. అలాగే 2021-22 ఆర్థిక సంవత్సరంలో కౌంటర్ వద్ద ఈ-టికెట్ల రద్దు వల్ల రూ.694.08 కోట్లు వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో 2022 డిసెంబరు వరకు టికెట్ల క్యాన్సిలేషన్ ద్వారా రూ.604.40 కోట్లు వచ్చినట్లు తెలిపారు.

అలాగే ఎయిర్ కండిషన్డ్ తరగతిలో ప్రయాణించడం కోసం రైలు టికెట్‌‌ను నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు ద్వారా బుక్ చేసుకుని, దానిని ఆ తర్వాత రద్దు చేసుకుంటే, ప్రతి టిక్కెట్‌కు రూ.30 చొప్పున వసూలు చేస్తున్నట్లు తెలిపారు. యూపీఐ(Unified Payments Interface) ద్వారా బుక్ చేసుకున్న టికెట్‌ను రద్దు చేసుకుంటే, ప్రతి టిక్కెట్‌కు రూ.20 వసూలు చేస్తున్నట్లు తెలిపారు. నాన్ ఏసీ తరగతుల్లో ప్రయాణించడం కోసం తీసుకున్న టిక్కెట్‌‌ను రద్దు చేసుకోవాలంటే, దానిని నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు ద్వారా బుక్ చేసుకుంటే, ప్రతి టికెట్‌కు రూ.15 చొప్పున వసూలు చేస్తున్నట్లు తెలిపారు. యూపీఏ ద్వారా బుక్ చేసుకున్న టిక్కెట్‌ను రద్దు చేయడానికి ప్రతి టికెట్‌కు రూ.10 వసూలు చేస్తున్నట్లు చెప్పారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens