A serious road accident took place in Parvathipuram Manyam district. A speeding lorry collided with a passing auto near Komarada in the district, killing six people. Two others were seriously injured. The incident took place while the deceased were on their way to a wedding.
All the victims were identified as immigrants. A family belonging to anti-immigration family is going to the wedding of one of their relatives. Meanwhile, a speeding lorry collided with an auto near Cholapadam in Komarada mandal. Six people died on the spot in this incident.
Two others were seriously injured. They were taken to the hospital. Their condition is also said to be critical. The people in the auto were scattered on the road as the lorry hit it at high speed.
Telugu version
పార్వతీపురం మన్యం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని కొమరాడ దగ్గర వేగంగా వస్తున్న లారీ.. అటుగా వళ్తున్న ఆటోను ఢీకొట్టింది.. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు వివాహానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది.
బాధితులందరూ అంటివలసకు చెందిన వారిగా గుర్తించారు. అంటివలసకు చెందిన ఓ కుటుంబ బంధువుల్లో ఒకరి వివాహానికి వెళ్లి వస్తున్నారు. ఈ సమయంలో కొమరాడ మండలం చోలపదం దగ్గర వేగంగా వస్తున్న లారీ ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు.
మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు. లారీ వేగంగా ఢీకొట్టడంతో ఆటోలో ఉన్న వారు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు.