My journey is with Jana Sena.

Actually, Prithvi's hometown is Tadepalli Gudem in West Godavari District. But he revealed that he will contest from Chodavaram in Anakapalli district. He recalled that he worked very hard for the victory of YCP during the last assembly elections. He was removed from the post of Chairman of Sri Venkateswara Bhakti Channel without conducting any investigation regarding the sexual allegations against him. And even though such allegations were made against ministers, MLAs and MPs in YCP, the party did not take any action.

He said that when he was in critical condition during Corona, at least YCP did not respond in any way.. did not help. But Mega Brother Nagababu came to know about my condition and responded immediately. He remembered that arrangements were made for providing treatment.. Then insurance was given from us. Prithvi said that since then he felt that he had made a mistake by leaving Mega Family.

Telugu version

వాస్తవానికి పృథ్వి సొంత ఊరు.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లి గూడెం. అయితే తాను ఎన్నికల బరిలో అనకాపల్లి జిల్లాలోని చోడవరం నుంచి దిగనున్నానని వెల్లడించారు. తాను గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డానని.. తనపై వచ్చిన లైంగిక ఆరోపణల విషయంలో ఏ మాత్రం విచారణ జరపకుండా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ చైర్మన్  పదవి నుంచి తప్పించారంటూ గుర్తు చేసుకున్నారు. మరి వైసీపీలో మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీ వంటి వారిపై కూడా ఇటువంటి ఆరోపణలు వచ్చినా ఎటువంటి చర్యలు పార్టీ తీసుకోలేదని .. నా పై మాత్రమే చర్యలు తీసుకున్నారంటూ ఆరోపించారు.

తాను కరోనా సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కనీసం వైసీపీ ఏ విధంగా స్పందించలేదని.. సహాయం చేయలేదని చెప్పారు. అయితే మెగా బ్రదర్ నాగబాబు నా స్థితి తెలుసుకుని వెంటనే స్పందించారు. చికిత్స అందించడం కోసం ఏర్పాట్లు చేశారని.. అప్పటి మా నుంచి ఇన్సూరెన్స్ ఇప్పించారని గుర్తు చేసుకున్నారు. తనకు అప్పటి నుంచి మెగా ఫ్యామిలీని వదిలి తప్పు చేసినట్లు అనిపించిందన్నారు పృథ్వి.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens