JEE Main Session-2 Exams started from today

EE Main-2023 final phase exams started from Thursday (April 6). Around 9.40 lakh students will appear for these exams across the country. About one and a half lakh people from the states of Andhra Pradesh and Telangana are writing the exams. Examinations are being conducted in 330 cities in the country and 15 cities abroad. On April 6, 8, 10, 11, 12, 13, 15, the exams will be conducted online in two batches per day.

While 8.60 lakh people applied for the first phase of JEE Main-2023 held last January, only 8.24 lakh people appeared for the exam. 9.40 lakh people have applied for the final JEE Main exam. That means the number of repeat applicants has increased by 80 thousand more than the first time. The best score in these two sessions will be taken into consideration and the final rank will be assigned. Reservation wise cutoff marks are decided and ranks are announced. Among them, only the first two and a half lakhs will qualify to write JEE Advanced. The JEE Advanced exam will be held on June 4.

Telugu Version

జేఈఈ మెయిన్‌-2023 తుది విడత పరీక్షలు గురువారం (ఏప్రిల్ 6) నుంచి ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా సుమారు 9.40 లక్షల మంది విద్యార్ధులు హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి సుమారు లక్షన్నర మంది పరీక్షలు రాస్తున్నారు. దేశంలో మొత్తం 330 నగరాల్లో, విదేశాల్లోని 15 నగరాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 6, 8, 10, 11, 12, 13, 15 తేదీల్లో రోజుకు రెండు విడతల చొప్పున ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు.

కాగా గత జనవరిలో జరిగిన తొలివిడత జేఈఈ మెయిన్‌-2023కు 8.60 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 8.24 లక్షల మంది మాత్రమే పరీక్ష రాశారు. ఇక తుది విడత జేఈఈ మెయిన్‌ పరీక్షకు 9.40 లక్షల మందిల మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే తొలిసారి కంటే మలిసారి దరఖాస్తుదారుల సంఖ్య 80 వేలు పెరిగింది. ఈ రెండు సెషన్లలో వచ్చిన మార్కుల్లో బెస్ట్‌ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుని తుది ర్యాంకును కేటాయిస్తారు. రిజర్వేషన్ల వారీగా కటాఫ్‌ మార్కులు నిర్ణయించి ర్యాంకులను ప్రకటిస్తారు. వీరిలో తొలి రెండున్నర లక్షల మంది మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అర్హత సాధిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష జూన్‌ 4న జరగనుంది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens