Election heat has just started in AP. The leaders of the ruling party.. to go forward to the people.. the development works done after they came to power. The YSRCP leaders are getting ready to take the policies they promised in the election before the people. The activity was designed to go into the field more vigorously with the objective of public welfare.
CM Jagan has implemented the promises given during the last election and is preparing to take the welfare schemes to the people. From 20th to 175th assembly constituencies, the campaign program 'Jagananne Maa Bhabhava' will be held simultaneously.
In this regard, YCP will hold a wide-scale meeting under the chairmanship of CM Jagan today at 3.30 pm. Party regional coordinators, district presidents, MLAs, in-charges, MLCs and observers will be present in this meeting. In this meeting, the future program of Jagananne, which will start from 20th of this month, will be mainly discussed. The MLAs will submit the final list for the appointment of household heads.
This program will be held in 15 thousand secretariats in 175 constituencies of the state till 27th of this month. All the MLAs and Constituency Coordinators will hold press conferences in their constituencies and start campaigning at least 25 to 30 houses. Kalini Griha Saraths along with volunteers will visit the houses. Secretariat conveners, household heads, village and ward volunteers will go door to door in the program 'Jagananne Ma Bhabhava' and explain the welfare schemes implemented by the government to the people.
Telugu version
ఏపీలో ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. అధికార పార్టీ నేతలు.. ప్రజల ముందుకు వెళ్ళడానికి.. తాము అధికారంలోకి వచ్చిన అనంతరం చేసిన అభివృద్ధి పనులు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు చేసిన విధానాన్ని ప్రజల ముందుకు తీసుకుని వెళ్ళడానికి వైఎస్సార్‌సీపీ నేతలు రెడీ అవుతున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మరింత జోరుగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళడానికి కార్యాచరణ రూపొందించారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ అమలు చేసినవి, ప్రజలందరికీ అందజేసిన సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకుని వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 20 నుంచి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో ‘జగనన్నే మా భవిష్యత్తు’ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఈ మేరకు ఈరోజు మధ్యాహ్నం 3.30 కి సీఎం జగన్ అధ్యక్షతన వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే లు, ఇంఛార్జీలు, ఎమ్మెల్సీ లు, పరిశీలకులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంపై ప్రధానంగా చర్చించనున్నారు. గృహ సారథుల నియామకానికి సంబంధించిన తుది జాబితాను ఎమ్మెల్యేలు సమర్పించనున్నారు.
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోని 15 వేల సచివాలయాల్లో ఈ నెల 27 వరకూ ఈ కార్యక్రమం జరగనుంది. మ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలందరూ తమ నియోజకవర్గాల్లో పత్రికా సమావేశాలు నిర్వహించి, కనీసం 25 నుంచి 30 ఇళ్లకు తిరిగి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. వాలంటీర్ల తో కలిని గృహ సారథులు ఇళ్లను సందర్శించనున్నారు. సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, గ్రామ, వార్డు వలంటీర్లు ఇంటింటికీ తిరిగి ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించనున్నారు.