This is a heart breaking incident. An event that moves every human being.
A heartbreaking incident in Vizianagaram districtBrings you to tears. He is a poor man. Belongs to Odisha.
When his wife fell ill, he was admitted to a private hospital in Vizianagaram in the border district.
But the doctors said that it is difficult for her to survive.. Her body is not cooperating with the treatment.. to take her home.
So he returned to Orissa with his wife in an auto. His wife died on the way.
The auto driver dropped the dead body on the Chelluru ring road and left. Due to lack of money, the husband carried his wife's dead body on his shoulder and walked for kilometers.
Vizianagaram Rural Police reached there and cooperated with the local people. As he was very hungry, rice was served first. Then arrangements were made to take the dead body from nearby to their own village with the help of an ambulance.
Telugu version
గుండెలు తరుక్కుపోయే ఘటన ఇది. మనసున్న ప్రతి మనిషిని కదిలించే సంఘటన. విజయనగరం జిల్లాలో హృదయవిదారక ఘటన మిమ్మల్ని కన్నీరు పెట్టిస్తుంది.
అతనో పేద వ్యక్తి. ఒడిస్సాకు చెందినవాడు. భార్య అనారోగ్యం పాలవ్వడంతో సరిహద్దు జిల్లాలో విజయనగరంలోని ఓ ప్రవేట్ ఆస్పత్రిలో చేర్చించాడు. కానీ ఆమె బ్రతకడం కష్టమని.. చికిత్సకు శరీరం సహకరించటం లేదని.. ఇంటికి తీసుకెళ్లమన్నారు వైద్యులు. దీంతో ఆటోలో భార్యతో కలిసి తిరిగి ఒరిస్సాకు పయనమయ్యాడు. మార్గమధ్యలోనే భార్య మృతి చెందింది.
దీంతో చెల్లూరు రింగ్ రోడ్డులో డెడ్ బాడీని దించి వెళ్లిపోయాడు ఆటో డ్రైవర్. డబ్బులు లేకపోవడంతో భార్య మృతదేహాన్ని భుజాన వేసుకొని కిలోమీటర్ల మేర నడిచాడు భర్త. స్థానికులు సమాచారం ఇవ్వడంతో.. అక్కడికి చేరుకుని సహయకచర్యలు చేపట్టారు విజయనగరం రూరల్ పోలీసులు.
అతడి తీవ్రమైన ఆకలితో ఉండటంతో ముందు అన్నం పెట్టారు. ఆపై దగ్గరుండి డెడ్ బాడీని అంబులెన్స్ సహాయంతో సొంత గ్రామం చేర్చేలా ఏర్పాట్లు చేశారు.