The mask of being a lawyer was very useful for her husband Madhubabu. In the same guise, Madhubabu along with his mother showed live hell to Supriya. Madhubabu's anarchies are being revealed one by one as the pathetic incident of being beaten without even giving her rice is being dug up. A wicked idea that girls are inferior has driven the house into a superstition. If everyone is left to eat, they should eat one meal. Or else... starve yourself... Even if the bowels twist in the stomach, it should not come out. Even if they bring anything from outside in the house, they do not touch it. Supriya is in hell if she touches it... girls in her mouth... restrictions are not allowed to eat foreign substances.
The court said that the children should be kept with their mother but to no avail. After 12 years of house arrest, Supriya reached home alone. Another tragedy in this case is that the children did not agree to go to Supriya. Moreover...it is another strange fact that even the real children are not calling Supriya as Amma...Peddamma.
Telugu version
లాయర్ అన్న ముసుగు భర్త మధుబాబుకి బాగా ఉపయోగపడింది. అదే ముసుగులో తన తల్లితో కలిసి మధుబాబు సుప్రియకి ప్రత్యక్ష నరకం చూపించారు. ఆమెకు అన్నం కూడా పెట్టకుండా ముప్పతిప్పలు పెట్టిన దయనీయమైన ఘటన తవ్వేకొద్దీ మధుబాబు అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆడపిల్లలంటే హీనమైనదనే ఓ దుర్మార్గపు ఆలోచన ఆ ఇంటిని ఓ మూఢత్వంలోకి నెట్టేసింది. అందరూ తినగా మిగిలితే ఓ పూట తినాలి. లేదంటే … ఆకలితో అలమటించాలి… కడుపులో పేగులు మెలితిప్పినా బయటపడకూడదు. ఇంట్లో వాళ్లు బయటి నుంచి ఏదైనా తెచ్చుకున్నా అది టచ్ చేసే పనేలేదు. ముట్టుకుంటే సుప్రియకు నరకమే… దానికి మనిళ్ళల్లో ఆడపిల్లలు… బయటి పదార్థాలు తినకూడదంటూ ఆంక్షలు.
పిల్లలను తల్లి దగ్గర ఉంచాలని కోర్టు చెప్పినా ఫలితం లేకుండాపోయింది. 12 ఏళ్ళ గృహనిర్బంధం తరువాత ఒంటరిగానే ఇంటికి చేరింది సుప్రియ. సుప్రియ దగ్గరకు వెళ్ళడానికి పిల్లలు అంగీకరించకపోవడం ఈ కేసులో మరో విషాదం. అంతేకాదు… అసలు పిల్లలు కూడా సుప్రియని అమ్మా అని పిలవకుండా…పెద్దమ్మా అని పిలుస్తుండడం మరో విచిత్రం.