Confusion of firing in Pulivendula.. one killed, another injured.. Do you know who did the firing..

Locals are expressing suspicion that the firing took place in a land dispute. Dileep, who was seriously injured in the firing, was shifted to Kadapa Rims for treatment. However, Dilip Yadav died while being taken to Vempalle hospital after being hit by bullets in his chest. Mastan, who was injured in the firing, is being treated at the hospital due to an injury to his hand. It seems that Dileep and Basha were shot in the afternoon. It is reported that Bharat fired because of financial disputes. Bharat Kumar Yadav, who was trying to escape, was taken into custody by Pulivendula police.

Bharat Kumar Yadav opened fire near the flower beds in Pulivendului. Earlier cases were registered against Bharat for threatening him with a gun in a land dispute. Questions are being raised as to why Bharat Yadav's licensed revolver was not seized earlier. 2 weeks ago he threatened with a gun. Criticisms are pouring in on the negligence of the police with today's shooting incident. Police are interrogating witnesses at the scene.

Telugu version

ఓ స్థల వివాదంలో కాల్పులు జరిగినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ దిలీప్‌ను కడప రిమ్స్‌లో చికిత్స కోసం తరలించారు. అయితే, దిలీప్ యాదవ్ ఛాతిలో బుల్లెట్లు దిగడంతో వేంపల్లె ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. కాల్పుల్లో గాయపడిన మస్తాన్‌కు చేతికి గాయం కావడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. దిలీప్‌, బాషాలపై మధ్యాహ్నం కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. ఆర్థిక వివాదాల కారణంగానే భరత్‌ కాల్పులు జరిపినట్లుగా సమాచారం. పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నభరత్‌ కుమార్ యాదవ్‌‌ను పులివెందుల పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.

పులివెందులలోని పూల అంగళ్ల సమీపంలో కాల్పులు జరిపాడు భరత్ కుమార్ యాదవ్. ముందుగా స్థల వివాదంలో గన్‌తో బెదిరించినందుకు గతంలోనే భరత్‌పై కేసులు నమోదయ్యాయి. భరత్‌ యాదవ్‌ లైసెన్స్డ్‌ రివాల్వర్‌ అప్పుడే ఎందుకు స్వాధీనం చేసుకోలేదనే ప్రశ్నలు వస్తున్నాయి. 2 వారాల క్రితమే గన్‌తో బెదిరింపులకు దిగాడు. ఇవాళ కాల్పుల ఘటనతో పోలీసుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఈ ఘటనా స్థలంలో సాక్షుల్ని విచారిస్తున్నారు పోలీసులు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens