Changes in Hyderabad metro timings.. The last train leaves just then.. Full details.

Metro has issued a critical alert for commuters. As the Nampally Exhibition (Numayush) ends, the metro train timings have changed from Thursday. The last trip trains will leave at 11 pm as earlier instead of 12 pm. The last metro trains leave from terminal stations like LBnagar, Miyapur, Nagol, Rayadurgam and JBS. Reach the destination by 12 midnight. Minister Mahmood Ali congratulated Keolis Stations DGM Jaipal Reddy on the closing day of Numaish for the services provided by L&T Hyderabad Metro during the exhibition.

 A memento was presented.On the occasion of Numaish in Nampally, the officials had earlier revealed that Metro train services will be extended by another hour. Officials said that metro trains will run till 12 midnight till Numaish is completed. It is said that these increased working hours will be applicable on LB Nagar – Miyapur, Nagol – Rayadurgam routes. In view of the rush of passengers, ticket counters have been increased at Gandhi Bhavan metro station under Numaish.

However, passengers have taken advantage of this facility. Metro sources said that 11 lakh passengers used the metro to go to the exhibition during these 46 days.

Telugu version

ప్రయాణికులకు మెట్రో కీలక అలర్ట్ జారీ చేసింది. నాంపల్లి ఎగ్జిబిషన్‌ (నుమాయుష్) ముగియడంతో మెట్రో రైలు వేళలు గురువారం నుంచి మారాయి. రాత్రి 12 గంటలు కాకుండా గతంలో నడిచినట్లే రాత్రి 11 గంటలకే చివరి ట్రిప్ రైళ్లు బయల్దేరతాయి. టర్మినల్‌ స్టేషన్లైన ఎల్‌బీనగర్‌, మియాపూర్‌, నాగోల్‌, రాయదుర్గం, జేబీఎస్‌ నుంచి చివరి మెట్రో రైళ్లు వెళ్తాయి. రాత్రి 12 గంటల వరకు గమ్యస్థానానికి చేరుకుంటాయి. ఎగ్జిబిషన్‌ సందర్భంగా ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రో అందించిన సేవలకుగాను నుమాయిష్‌ ముగింపు రోజు కియోలిస్‌ స్టేషన్స్‌ డీజీఎం జైపాల్‌రెడ్డిని మంత్రి మహమూద్‌ అలీ అభినందించారు. జ్ఞాపికను బహూకరించారు.

కాగా.. నాంపల్లిలో నుమాయిష్ సందర్భంగా.. మెట్రో ట్రైన్ సేవలను మరో గంట పొడిగిస్తున్నట్లు గతంలో అధికారులు వెల్లడించారు. నుమాయిష్ పూర్తయ్యే వరకు అర్థరాత్రి 12 గంటల దాక మెట్రో రైళ్లు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఎల్బీ నగర్ – మియాపూర్, నాగోల్ – రాయదుర్గం మార్గాల్లో ఈ పెంచిన పని వేళలు అమల్లో ఉంటాయని చెప్పారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా నుమాయిష్ పరిధిలోని గాంధీభవన్ మెట్రో స్టేషన్‌లో టికెట్ కౌంటర్లు పెంచారు.

అయితే.. ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకున్నారు. ఈ 46 రోజులు ఎగ్జిబిషన్‌కు వెళ్లేందుకు 11 లక్షల మంది ప్రయాణికులు మెట్రో వినియోగించుకున్నారని మెట్రో వర్గాలు తెలిపాయి.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens