buttermilk more beneficial than curd for health..

Most of us can't really eat without milk and curd. Although curd comes from milk and buttermilk comes from it, there are many differences between the three.

Curd vs Buttermilk: Most of us can't really eat without milk and curd. Although curd comes from milk and buttermilk comes from it, there are many differences between the three. The nutrients and benefits they provide are also different.

 In this order, it is suggested to drink buttermilk instead of milk and curd. According to Ayurvedic experts, the reason for this is the changes in the response of each of these three bodies. Yogurt contains good bacteria. It ferments when exposed to heat.

 Even when it enters the stomach, it ferments due to the hot acids in the stomach. It warms the intestines of the stomach. But buttermilk from curdIt is said that it cools the body. According to their instructions buttermilk is suitable for all body types and seasons.

 That is why buttermilk is much healthier than curd. Yogurt increases fat and strength. Vata helps in reducing imbalance. And not everyone can eat curd.
Who should not eat curd?
Health experts say that those suffering from obesity, phlegm disorders, bleeding, inflammation and rheumatoid arthritis should avoid curd. Not only that, Ayurvedic science insists on not eating curd at night. Because it triggers problems like cold, cough and sinus.

 If you feel you cannot avoid eating curd at night, they suggest adding a pinch of pepper or fenugreek to it and making it a habit. Do not heat the curd yet. Heating yogurt kills the good bacteria in it. Some people heat curd and make something like buttermilk broth.

 But only the body of those who eat it often can tolerate it. People suffering from skin disorders, bile imbalance, headache, insomnia and digestive problems should not eat curd.

Telugu Version

 మనలో చాలా మంది పాలు, పెరుగు లేకుండా అసలు తినలేరు. పాల నుంచి పెరుగు దాని నుంచి మజ్జిగ వచ్చినప్పటికీ మూడింటి మధ్య తేడాలు చాలానే.

Curd vs Buttermilk: మనలో చాలా మంది పాలు, పెరుగు లేకుండా అసలు తినలేరు. పాల నుంచి పెరుగు దాని నుంచి మజ్జిగ వచ్చినప్పటికీ మూడింటి మధ్య తేడాలు చాలానే ఉన్నాయి. అవి అందించే పోషకాలు, ప్రయోజనాలు కూడా భిన్నంగా ఉంటాయి. ఇక ఈ క్రమంలోనే పాలు, పెరుగుకు బదులుగా మజ్జిగ తాగాలని సూచిస్తుంటారు. అందుకు ఈ మూడు శరీరంలో ప్రతి స్పందించే విధానంలోని మార్పులే అందుకు కారణమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

 పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది వేడిని తాకినప్పుడు పులియబెడుతుంది. అది కడుపులోకి వచ్చినపుడు కూడా పొట్టలోని వేడి ఆమ్లాలు కారణంగా పులియబెట్టడం జరుగుతుంది. దాని వల్ల కడుపులోని పేగులు వేడెక్కుతాయి. కానీ పెరుగు నుంచి వచ్చిన మజ్జిగ మాత్రం శరీరాన్ని చల్లబరుస్తుందని అంటున్నారు.

 వారి సూచనల ప్రకారం మజ్జిగ అన్ని రకాల శరీరాలకు, సీజన్లకు అనుకూలంగా ఉంటుంది. అందుకే పెరుగు కంటే మజ్జిగ చాలా ఆరోగ్యకరమైనదని స్పష్టం చేశారు. పెరుగు కొవ్వు, బలాన్ని పెంచుతాయి. వాత అసమతుల్యతను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇంకా పెరుగును అందరూ తినలేరు.

పెరుగును ఎవరెవరు తినకూడదు..?

ఊబకాయం, కఫ రుగ్మతలు, రక్తస్రావం, వాపు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు పెరుగుకి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతే కాదు రాత్రిపూట పెరుగు తినకూడదని ఆయుర్వేద శాస్త్రం నొక్కి మరీ చెప్తుంది. ఎందుకంటే ఇది జలుబు, దగ్గు, సైనస్‌ వంటి సమస్యలను ప్రేరేపిస్తుంది.

 ఒకవేళ రాత్రిపూట పెరుగు తినకుండా ఉండలేరని అనుకుంటే అందులో చిటికెడు మిరియాలు లేదా మెంతులు వేసుకుని తినడం అలవాటు చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. ఇంకా పెరుగుని వేడి చేయకూడదు. పెరుగును వేడి చేయడం వల్ల అందులొని మంచి బ్యాక్టీరియా నాశనం అవుతుంది. కొంతమంది పెరుగుని వేడి చేసి మజ్జిగ చారు వంటివి తయారు చేస్తారు. అయితే అది తరచూ తింటున్న వారి శరీరం మాత్రమే తట్టుకోగలదు. చర్మ రుగ్మతలు, పిత్త అసమతుల్యత, తలనొప్పి, నిద్రలేమి, జీర్ణ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా పెరుగు తినకపోవడం మంచిది.


 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens