A sealed box in the garbage piles.

Hundreds of abortion kits, which were recently discovered in Tanuku Mandal, have brought to the fore the illicit drug trade in the district. One is not the other in the field by the roadside...the emergence of 850 abortion kits alone is causing a stir. The value of these is literally 4 lakhs. This has now become a local hot topic. But if the string was drawn in Thetili, the detour was moved in Karnataka. The authorities, who have been confused about where they are coming from all these days, have come to know that the supply of prohibited drugs is in Karnataka. As a result, five shops and godowns were raided in Tanuku Bhimavaram mandals and banned drugs worth 21 lakhs were seized. A case has been registered against K. Srinivas, the key mastermind of this illegal business.

Officials have raided five medical shops the other day...Illegal drugs valued at 16 lakhs have been seized...9 cases of illegal medical raids in a year. Seizure of drugs worth lakhs of rupees... this alone is enough to understand the medical mafia gang going on in West Godavari district. The role of RMPs and PMPs has been found to be crucial in this illegal drug bust. Batch numbers and MRP prices on medicines and abortion kits brought from neighboring states are wiped with sanitizer and sold at high prices.

Telugu version

తణుకు మండలం తేతలిలో తాజాగా బయటపడ్డ వందలాది అబార్షన్‌ కిట్లు జిల్లాలో యథేచ్ఛగా సాగుతోన్న దొంగ మందుల వ్యాపారం గుట్టురట్టు చేసింది. రహదారి పక్కన పొలంలో ఒకటో రెండో కాదు…ఏకంగా 850 అబార్షన్‌ కిట్లు బయటపడటం కలకలం రేపుతోంది. వీటి విలువ అక్షరాలా 4 లక్షలు. ఇదే ఇప్పుడు స్థానికంగా హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే తేతిలిలో తీగలాగితే కర్నాటకలో డొంక కదిలింది. ఇన్నాళ్ళూ ఎక్కడినుంచి వస్తున్నాయో అర్థంగాక తికమకపడుతోన్న అధికారులకు నిషేధిత మందుల సప్లై వేళ్ళు కర్నాటకలో ఉన్నట్టు రూఢీ అయ్యింది. దీంతో తణుకు భీమవరం మండలాల్లో ఐదు షాపులు గొడౌన్లు పై దాడులు చేసి 21 లక్షలు విలువ చేసే నిషేధిత మందులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ వ్యాపారం దందాలో కీలక సూత్రధారి కె.శ్రీనివాస్‌పై కేసు నమోదు చేశారు.

మొన్నటికి మొన్న ఐదు మెడికల్‌ షాపులపై దాడులు చేశారు అధికారులు…16 లక్షల విలువచేసే అక్రమ మందులు సీజ్‌…ఏడాది కాలంలో 9 మెడికల్‌ అక్రమ దందా కేసులు. పాతిక లక్షల విలువైన మందులు సీజ్‌…ఇదొక్కటి చాలు పశ్చిమగోదావరి జిల్లాలో సాగుతోన్న మెడికల్‌ మాఫియా దందా అర్థం చేసుకోవడానికి. ఈ అక్రమ మందుల దందాలో ఆర్‌ఎంపీలూ, పీఎంపీల పాత్ర కీలకమని తేలింది. పొరుగు రాష్ట్రాల నుంచి తీసుకొస్తోన్న మందులు, అబార్షన్‌ కిట్లపై బ్యాచ్‌ నెంబర్లు, ఎంఆర్‌పీ ధరలను శానిటైజర్‌తో తుడిచేసి, అధిక ధరలకు విక్రయిస్తున్నారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens