Many kinds of creatures live in this creation. Some of them become extinct with time, while others are on the verge of extinction and show their existence from time to time. Freshly such an animal..
A very rare wild cat has been spotted on Mount Everest. Zoologists recently found this rare creature on Mount Everest. He said that this is the first time that these wild cats, called Pallas cats, have been seen on Mount Everest.
Wild cats appear to be a little bigger and stronger than cats usually found in villages. Pallas cats are also wild cats but they are very small. These are also known as manules.
These cats were first spotted in 1776 by zoologist Peter Simon Pallas in the vicinity of Lake Baikal. That is why they got the name Pallas cats. Pallas cats are gray, gray and red depending on their environment. They have a 20 to 30 cm long tail with small round ears on either side of the head.
Their legs are also very short. They have long hairs on their body. However, the hair on the belly is twice as long as the hair on the back. Since they mostly live in cold places, these long hairs help to protect them from extreme cold. They are mostly found in the Himalayas, Tibetan Plateau, Iranian Plateau and South Siberian Hills.
Telugu Version
ఎవరెస్ట్ శిఖరంపై అత్యంత అరుదైన అడవిజాతి పిల్లి దర్శనమచ్చింది. జంతు శాస్త్రవేత్తలు తాజాగా ఈ అరుదైన జీవిని ఎవరెస్ట్ శిఖరంపై కనుగొన్నారు. పల్లాస్ క్యాట్స్‌గా పిలిచేఎవరెస్ట్ శిఖరంపై అత్యంత అరుదైన అడవిజాతి పిల్లి దర్శనమచ్చింది.
జంతు శాస్త్రవేత్తలు తాజాగా ఈ అరుదైన జీవిని ఎవరెస్ట్ శిఖరంపై కనుగొన్నారు. పల్లాస్ క్యాట్స్‌గా పిలిచే ఈ అడవి పిల్లులు ఇలా ఎవరెస్టు శిఖరంపై కనిపించడం ఇదే తొలిసారి అని తెలిపారు..! సాధారణంగా గ్రామాల్లో కనిపించే పిల్లుల కంటే అడవి పిల్లులు కొంచెం పెద్దగా, బలంగా కనిపిస్తాయి. పల్లాస్ క్యాట్స్ కూడా అడవి పిల్లులే అయినా ఇవి చాలా చిన్నవిగా ఉంటాయి.
వీటిని మనూల్‌లు అని కూడా పిలుస్తారు. ఈ పిల్లులను 1776లో మొదటిసారి బైకాల్ సరస్సు పరిసర ప్రాంతంలో పీటర్ సైమన్ పల్లాస్ అనే జంతుశాస్త్రవేత్త గుర్తించారు. అందుకే వీటికి పల్లాస్ క్యాట్స్ అనే పేరు వచ్చింది. పల్లాస్ క్యాట్స్ ఆయా పరిసరాలను బట్టి గ్రే, బూడిద, ఎరుపు రంగుల్లో ఉంటాయి.
తలకు ఇరువైపుల గుండ్రంగా చిన్ని చిన్ని చెవులతో, 20 నుంచి 30 సెంటీమీటర్ల పొడవైన తోక కలిగి ఉంటాయి. వీటి కాళ్లు కూడా చాలా పొట్టిగా ఉంటాయి. వీటి శరీరంపై పొడవాటి వెంట్రుకలు ఉంటాయి. అయితే, వీటి వీపు భాగంలో ఉండే వెంట్రుకల కంటే ఉదర భాగంలో ఉండే వెంట్రుకలు రెండింతలు ఎక్కువ పొడవుతో ఉంటాయి. ఇవి ఎక్కువగా చల్లటి ప్రదేశాల్లో నివసిస్తాయి కనుక.. చలి తీవ్రత నుంచి కాపాడేందుకు ఈ పొడవాటి వెంట్రుకలు తోడ్పడుతాయి. ఇవి ఎక్కువగా హిమాలయాలు, టిబెట్ పీఠభూమి, ఇరానియన్ పీఠభూమి, దక్షిణ సైబీరియన్ కొండ ప్రాంతాల్లో కనిపిస్తాయి.