festyle

విజయ్ దేవరకొండ నుంచి అల్లు అర్జున్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ – "స్వీట్ బ్రదర్" అని స్పందించిన బన్నీ

పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండలు మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ ఇద్దరూ ఇప్పటికే తమ మధ్య ఉన్న బంధాన్ని పలు సందర్భాల్లో చాటుకున్నారు. తాజాగా, విజయ్ దేవరకొండ ప్రారంభించిన 'రౌడీ' స్టోర్ సందర్భంగా Bunnyకి ఇచ్చిన గిఫ్ట్‌ మళ్లీ ఈ స్నేహ బంధాన్ని హైలైట్ చేసింది.

హైదరాబాద్‌లో విజయ్ రౌడీ బ్రాండ్‌కు చెందిన కొత్త స్టోర్‌ను గ్రాండ్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌కు రౌడీ బ్రాండ్ ప్రత్యేక డ్రెస్సులు, అలాగే అతని పిల్లల కోసం క్యూట్ మినీ బర్గర్లను గిఫ్ట్‌గా పంపించారు. ఈ గిఫ్ట్ ప్యాక్‌కు సంబంధించిన ఫోటోను అల్లు అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్ చేస్తూ –
“మై స్వీట్ బ్రదర్.. ఎప్పుడూ నువ్వు సర్‌ప్రైజ్ చేస్తుంటావు. సో స్వీట్” అంటూ ప్రేమతో స్పందించారు.

ఇది మొదటిసారి కాదు. గతంలో ‘పుష్ప 2’ విడుదల సందర్భంగా కూడా విజయ్ దేవరకొండ ప్రత్యేక టీ-షర్ట్‌లను ‘పుష్ప’ పేరుతో బన్నీకి గిఫ్ట్‌గా పంపిన సంగతి తెలిసిందే. అప్పట్లో కూడా బన్నీ స్పందిస్తూ – “నా స్వీట్ బ్రదర్… నీ ప్రేమకు కృతజ్ఞతలు” అని సోషల్ మీడియా ద్వారా తన అభిమానాన్ని చాటాడు. విజయ్ కూడా "లవ్ యూ అన్నా.. మన సంప్రదాయాలు కొనసాగుతాయి" అంటూ బదులిచ్చాడు.

ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా ఉన్న ఇద్దరు స్టార్‌లు

అల్లు అర్జున్ – ఇటీవలే అట్లీ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా నిర్మాణాన్ని సన్ పిక్చర్స్ భరిస్తోంది. ఇటీవల ఓ స్పెషల్ వీడియో ద్వారా ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో చిత్రాన్ని చేయనున్నారు.

విజయ్ దేవరకొండ – ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘కింగ్‌డమ్’ అనే స్పై థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించింది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens