s Social News

Pooja Hegde's wedding party

Pooja took care of all the affairs related to the wedding. She stayed near the house for about a week and arranged the wedding. Sharing her happiness on this occasion, she shared the wedding photos on social media

There is a wedding buzz in star heroine Pooja Hegde's house. Her brother Rishab Hegde's wedding was a grand affair. He married a woman named Sivanishetti. Pooja took care of all the affairs related to this wedding. She stayed near the house for about a week and arranged the wedding. Sharing her happiness on this occasion, she shared the wedding photos on social media. 'My brother Prema got married. I am happier than I have ever been since the beginning of this celebration. She laughed like a child. Anandabashpas came. My brother is entering the next chapter of his life. Buttabomma showered her love saying, 'I want you to bless me with a full heart.' Pooja Hegde in wedding photosShe looked very beautiful in a red silk saree. Now these photos have become viral on social media. Movie stars, netizens and fans are also sending their best wishes and wishes to the new couple.

As far as movies are concerned.. Last year she acted in Radheshyam, Acharya, Beast, Circus (Hindi). But all the films flopped at the box office. With this, Achithuchi is now doing films. Currently she is acting in the movie Kisi Ka Bhai Kisi Ka Jaan with Salman Khan. Venkatesh and Jagapathi Babu are playing key roles in this. Also, megapower star Ram Charan will be seen in a key role. Apart from this, she is also acting as the heroine in SSMB 28, which is being made by the combination of Mahesh and Trivikram. The shooting of this movie will start soon.

Telugu Version

పెళ్లికి సంబంధించి అన్నీ వ్యవహారాలను దగ్గరుండి చూసుకుంది పూజా. సుమారు వారం రోజుల నుంచి ఇంటి దగ్గరే ఉంటూ పెళ్లి ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా తన ఆనందాన్ని పంచుకుంటూ పెళ్లి ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిందిస్టార్‌ హీరోయిన్‌ పూజాహెగ్డే ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. ఆమె సోదరుడు రిషబ్‌ హెగ్డే వివాహం అంగరంగవైభవంగా జరిగింది. 
శివానీశెట్టి అనే మహిళను అతను వివాహమాడాడు. ఈ పెళ్లికి సంబంధించి అన్నీ వ్యవహారాలను దగ్గరుండి చూసుకుంది పూజా. సుమారు వారం రోజుల నుంచి ఇంటి దగ్గరే ఉంటూ పెళ్లి ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా తన ఆనందాన్ని పంచుకుంటూ పెళ్లి ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ‘నా సోదరుడు ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఈ వేడుక ప్రారంభం నుంచి నేను ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉన్నా. చిన్నపిల్లలా నవ్వేశా. ఆనందభాష్పాలు వచ్చాయి. మా సోదరుడు తన జీవితంలో తదుపరి అధ్యాయంలోకి అడుగుపెడుతున్నాడు. మీరు కూడా నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుకుంటున్నా’ అని తన ప్రేమను కురిపించిందీ బుట్టబొమ్మ. పెళ్లి ఫొటోల్లో పూజా హెగ్డే ఎర్రని పట్టుశారీలో ఎంతో అందంగా కనిపించింది.
 ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. సినీ తారలు, నెటిజన్లు, అభిమానులు సైతం కొత్త దంపతులకు శుభాకాంక్షలు, విషెస్‌ తెలియజేస్తున్నారు.ఇక సినిమాల విషయానికొస్తే.. గతేడాది రాధేశ్యామ్‌, ఆచార్య, బీస్ట్, సర్కస్ (హిందీ) సినిమాల్లో నటించింది. అయితే అన్ని సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో ఇప్పుడు ఆచితూచి సినిమాలు చేస్తోంది.
 ప్రస్తుతం ఆమె సల్మాన్‌ ఖాన్‌తో కలిసి కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్‌ అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో వెంకటేశ్‌, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. దీంతో పాటు మహేశ్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కతోన్న ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 28 సినిమాలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ పట్టాలెక్కనుంది.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens