జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడి తర్వాత మోదీ తిరిగొచ్చి అత్యవసర సమావేశం నిర్వహించారు
జమ్మూ కశ్మీర్ పహల్గాం లో జరిగిన ఉగ్రదాడిలో 16 మంది మృతి చెందడంతో, ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియాలోని పర్యటనను మధ్యలోనే నిలిపి ఢిల్లీకి తిరిగి వచ్చారు. ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో అత్యవసర భద్రతా సమావేశం నిర్వహించారు.
ఈ దాడి బైసారన్ వ్యాలీలో చోటుచేసుకుంది. పర్యాటకులు, ఇంటెలిజెన్స్ ఆఫీసర్ సహా 16 మంది చనిపోగా, అనేక మందికి గాయాలయ్యాయి. ఈ దాడికి పాకిస్తాన్ ఆధారిత రెసిస్టెన్స్ ఫ్రంట్ బాధ్యత వహించింది. అటవీ ప్రాంతం నుంచి తీవ్రవాదులు కాల్పులు జరిపారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.
దాడి నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లో భద్రత మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో బార్బెడ్ వైర్లు పెట్టి, వాహనాలను కఠినంగా తనిఖీ చేస్తున్నారు. ఉధంపూర్ జిల్లాలో బంద్‌కు పిలుపునిచ్చారు.