tics Andhra Pradesh

Pawan Kalyan Varahi yatra second phase schedule finalized meeting with party leaders today

The second phase schedule of Varahi Vijaya Yatra undertaken by Janasena leader Pawan Kalyan has been finalised. Pawan Kalyan decided to undertake the second leg of the trip from Eluru. Janasena party leader P. Hariprasad said that the yatra will start with an open meeting held in Eluru on the 9th of this month at 5 pm.

 Pawan, who came to Gannavaram from Hyderabad to discuss the second phase of Varahiyatri, had a long discussion with Nadendla Manohar, chairman of the political affairs committee, at the party office in Mangalagiri. Pawan will once again meet the party leaders today. In this meeting, Pawan will discuss the local political situation with the leaders of Denduluru, Tadepalligudem, Unguthuru and Tanuku constituencies along with Eluru.

The first installment of Pawan Kalyan's Varahi Yatra was a super success. Varahi Yatra got huge response from people. No matter where the meeting was held, people, Janasena activists and Pawan's fans came in large numbers. Pawan Sabhas which appeared to be full caused concern in the ruling and opposition parties as well.

 But Varahi criticized the government on public issues throughout the first leg of the trip. He made harsh comments on the leaders of the ruling party. With this, the Janasena Party and its leader Pawan Kalyan focused on the second phase of the trip. Preparations are being made to continue the Yatra from West Godavari.

Telugu version

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర రెండో దశ షెడ్యూల్ ఖరారైంది. రెండో విడత యాత్రను ఏలూరు నుంచి చేపట్టాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఏలూరులో నిర్వహించే బహిరంగ సభతో యాత్ర ప్రారంభమవుతుందని జనసేన పార్టీ నేత పి.హరిప్రసాద్ తెలిపారు.

  వారాహియాత్రి రెండో విడతపై చర్చించేందుకు హైదరాబాద్ నుంచి గన్నవరం వచ్చిన పవన్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో సుదీర్ఘంగా చర్చించారు. ఇవాళ మరోసారి పార్టీ నేతలతో పవన్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఏలూరుతో పాటు దెందులూరు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాల నేతలతో స్థానిక రాజకీయ పరిస్థితులపై పవన్ చర్చించనున్నారు.

పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదటి విడత సూపర్ సక్సెస్ అయ్యింది. వారాహి యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఎక్కడ సభ జరిగినా జనం, జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు భారీగా తరలివచ్చారు. ఫుల్ గా కనిపించిన పవన్ సభలు అధికార, ప్రతిపక్ష పార్టీల్లోనూ ఆందోళన రేకెత్తించాయి.

  కానీ వారాహి యాత్ర తొలి విడతలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని విమర్శించారు. అధికార పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో జనసేన పార్టీ, అధినేత పవన్ కళ్యాణ్ రెండో విడత యాత్రపై దృష్టి సారించారు. పశ్చిమగోదావరి నుంచి యాత్ర కొనసాగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens