ssips

చిరంజీవి ఎం.ఎం. కీరవాణి సంగీత కచేరి గురించి ఏమన్నారో తెలుసా?

మార్చి 22న కీరవాణి సంగీత కచేరి

హైదరాబాదులో హైటెక్స్ లో కార్యక్రమం

చిరంజీవి ఆసక్తికర వీడియో

ప్రముఖ సినీ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి మార్చి 22న హైదరాబాదులో సంగీత కచేరి నిర్వహించబోతున్నారు. ఈ మ్యూజిక్ కాన్సెర్ట్ కోసం మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో ప్రోమో ఇచ్చారు. ఈ ప్రోమోను కీరవాణి తన సోషల్ మీడియా పేజీలలో షేర్ చేశారు. వీడియో ప్రారంభంలో చిరంజీవి ఏదో వెదుకుతున్నట్లుగా కనిపిస్తారు.

వీడియోలో చిరంజీవి మాట్లాడుతూ, "హాయ్... ఏం వెదుకుతున్నానని అనుకుంటున్నారా...? మా ఇంట్లో ఒక కోడిపెట్ట ఉందండీ... అది పారిపోయింది. మామూలు కోడిపెట్ట కాదు... బంగారు కోడిపెట్ట. దానికోసం దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో కంప్లెయింట్ ఇచ్చాను. ఎక్కడైనా బంగారు కోడిపెట్ట ఉంటుందా అని వాళ్లు ఎగతాళిగా నవ్వుతున్నారు. వాళ్లు నమ్మడంలేదు.

కానీ, మార్చి 22న సాయంత్రం హైదరాబాదులో కీరవాణి ఆధ్వర్యంలో ఒక సంగీత కచేరి జరగబోతోంది... బంగారు కోడిపెట్ట అక్కడ కచ్చితంగా ఉంటుందని చెప్పారు. నాకు కూడా నమ్మకం ఉంది... ఆ బంగారు కోడిపెట్టను పట్టుకోవడానికి కొంతమందిని పంపిస్తాను. మీరు కూడా అక్కడకు వెళ్లండి... నా బంగారు కోడిపెట్టను పట్టుకోండి... వాటేసుకోండి... తీసుకొచ్చేసేయండి" అని వివరించారు.

ఈ వీడియోపై కీరవాణి స్పందిస్తూ, బంగారు కోడిపెట్ట సాంగ్ తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. "చిరంజీవి గారూ... మీ మాటలతో మళ్లీ ఆనాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లారు. అందరూ సిద్ధంగా ఉండండి... మీ కోసం బంగారు కోడిపెట్టను తీసుకువస్తున్నాను... మార్చి 22న హైదరాబాదులోని హైటెక్స్ లో కలుసుకుందాం" అని అన్నారు.

1992లో చిరంజీవి హీరోగా వచ్చిన ఘరానా మొగుడు చిత్రం ఎంతో పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ చిత్రం మ్యూజికల్ హిట్ కూడా కాగా, అందులోని బంగారు కోడిపెట్ట సాంగ్ సాంప్రదాయాన్ని ఉర్రూతలూగించింది. ఇప్పుడు ఈ సాంగ్ గురించి చిరంజీవి, కీరవాణి ఇద్దరూ మాట్లాడారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens