విమానంలో పెళ్లి రోజు వేడుక: చిరంజీవి దంపతుల హృద్యమైన సంబరాలు!
మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ తమ వివాహ వార్షికోత్సవాన్ని విభిన్నంగా జరుపుకున్నారు. దుబాయ్ వెళ్లే ఫ్లైట్‌లో చిరంజీవి దంపతులు ఈ ప్రత్యేక సందర్భాన్ని ఘనంగా జరుపుకున్నారు. అక్కినేని నాగార్జున, అమల, నమ్రత శిరోద్కర్ తదితర ప్రముఖులు కూడా ఈ ప్రయాణంలో చిరంజీవి కుటుంబానికి తోడుగా ఉన్నారు.
ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలను చిరంజీవి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా, అవి నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
చిరు భావోద్వేగ పోస్ట్
"దుబాయ్ మార్గమధ్యంలో మా ప్రియమైన స్నేహితులతో కలిసి విమానంలో మా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నాం. సురేఖ నా కలల జీవిత భాగస్వామి. ఆమె లాంటి సతీమణి దొరకడం నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఆమె నా బలం, నా మోటివేటర్.
ఆమె ఉనికి నాకు ఎప్పుడూ ఓదార్పునిస్తుంది, ప్రేరణనిస్తుంది. థ్యాంక్యూ సోల్‌మేట్! మా ఈ ప్రత్యేక రోజును మరింత అందంగా మార్చిన స్నేహితులు, కుటుంబ సభ్యులు, అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు! మీ ఆశీస్సులు మాకెప్పుడూ అండగా ఉండాలని కోరుకుంటున్నా!" అంటూ చిరు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు.