ఆపిల్ ఐఫోన్ 16e: తక్కువ ధరకే హై-ఎండ్ ఫీచర్లు!
ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ ఐఫోన్‌కు ఉన్న క్రేజ్ అద్భుతమైనది. ఇప్పుడు కంపెనీ ఐఫోన్ 16 సిరీస్‌లో అత్యంత చౌకైన మోడల్ అయిన Apple iPhone 16eను విడుదల చేసింది. CEO టిమ్ కుక్ ఈ బడ్జెట్ ఐఫోన్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తక్కువ ధరలో ఐఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే ఇదే సరైన అవకాశం!
48MP 2-ఇన్-1 కెమెరాతో అద్భుతమైన ఫోటోలు & వీడియోలు
ఆపిల్ ఫోన్లు అత్యున్నత కెమెరా పనితీరుకు ప్రసిద్ధి చెందాయి. ఐఫోన్ 16e తక్కువ ధరలో వచ్చినా, 48MP ఫ్యూజన్ కెమెరా & 2x టెలిఫోటో జూమ్ కలిగి ఉంది. సాధారణంగా ఐఫోన్‌లు డ్యూయల్ కెమెరా సెటప్ కలిగి ఉంటాయి, కానీ ఈ ఫోన్ 2-ఇన్-1 కెమెరా వ్యవస్థను కలిగి ఉండటం విశేషం. ఇది ఫోటోలు & వీడియోలను మరింత శక్తివంతంగా రూపొందిస్తుంది.
బలమైన బ్యాటరీ లైఫ్ & వేగవంతమైన ఛార్జింగ్
ఈ ఫోన్ A18 చిప్ ద్వారా శక్తివంతంగా పనిచేస్తుంది & iOS 18 కలిగి ఉంది. ఇందులో C1 మోడెమ్ కలిగి ఉండటంతో 5G కనెక్టివిటీ మెరుగ్గా ఉంటుంది. ఒకే ఛార్జ్‌పై 26 గంటల వీడియో ప్లేబ్యాక్ సామర్థ్యంతో ఇది iPhone 11 కంటే 6 గంటలు & iPhone SE కంటే 12 గంటలు ఎక్కువ బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. టైప్-C & వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయాన్ని కూడా కలిగి ఉంది.
ధర & అందుబాటు
Apple iPhone 16e $599 (భారతదేశంలో ₹59,900) ధరతో విడుదలైంది. ఇది 3 స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది:
- 128GB – ₹59,900
- 256GB – ₹69,900
- 512GB – ₹89,900
ఫిబ్రవరి 21 సాయంత్రం 6:30PM నుండి ప్రీ-ఆర్డర్ ప్రారంభమవుతుంది & ఫిబ్రవరి 28న నుండి ఆపిల్ స్టోర్లలో లభిస్తుంది.