ఫిబ్రవరిలో బ్యాంకు సెలవులు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రతి నెలా బ్యాంకు సెలవులను విడుదల చేస్తుంది. ఫిబ్రవరిలో బ్యాంకులకు సగం రోజుల పాటు సెలవులు ఉండగా, నెల చివరికి మహాశివరాత్రి సమీపిస్తోంది. ఈ సందర్భంగా పండుగ ఫిబ్రవరి 26 లేదా 27న వస్తుందా? బ్యాంకులు ఎప్పుడు మూసి ఉంటాయా? అనే సందేహం నెలకొంది.
ఏ రోజు బ్యాంకులు మూసి ఉంటాయి?
RBI విడుదల చేసిన సెలవు జాబితా ప్రకారం, మహాశివరాత్రి ఫిబ్రవరి 26న ఉంది. అందువల్ల ఆ రోజున అహ్మదాబాద్, ఐజ్వాల్, బేలాపూర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, డెహ్రాడూన్, ఏపీ, తెలంగాణ, జైపూర్, జమ్ము, కాన్పూర్, కొచ్చి, లక్నో, ముంబై, నాగ్‌పూర్, రాయ్‌పూర్, రాంచీ, తిరువనంతపురం, షిమ్లాలో బ్యాంకులు మూసి ఉంటాయి. అయితే కొందరు శివరాత్రి 27న ఉందని చెబుతుండటంతో అయోమయం ఏర్పడింది.
బ్యాంకింగ్ సేవలు ఎలాంటి ప్రభావం లేకుండా?
బ్యాంక్ సెలవులు ఉన్నా, ప్రస్తుత టెక్నాలజీ కారణంగా బ్యాంకింగ్ కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం ఉండదు. UPI, IMPS, నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. ATMల ద్వారా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఫిజికల్ చెక్ డిపాజిట్ సేవలు ఆలస్యంగా ఉండవచ్చు, కానీ లోన్, EMI లావాదేవీలు యధావిధిగా కొనసాగుతాయి.