WPL 2025: రిచా ఘోష్, ఎలిస్ పెర్రీ అద్భుత ప్రదర్శన – స్మృతి మంధాన
వడోదర, ఫిబ్రవరి 15: WPL 2025 ప్రారంభ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌పై అద్భుత విజయానికి RCB కెప్టెన్ స్మృతి మంధాన రిచా ఘోష్, ఎలిస్ పెర్రీ ని ప్రశంసించింది.
పెర్రీ (57 బంతుల్లో 34) రన్స్ చేసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టగా, రిచా ఘోష్ (24 బంతుల్లో 64) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. ఫలితంగా WPL చరిత్రలోనే అత్యధిక ఛేదన విజయాన్ని RCB అందుకుంది.
స్మృతి “వారి ఆట అద్భుతం. నెట్స్‌లో శ్రమించిన ఫలితం ఇది” అని ప్రశంసించింది.
RCB ప్రధాన బౌలర్లు గాయాల కారణంగా లేనప్పటికీ, “మంచి ప్రత్యామ్నాయాలు ఉన్నారు. బౌలింగ్, ఫీల్డింగ్ మెరుగుపరచుకోవాలి” అని పేర్కొంది.