World Wide Monkeypox Worry | Increased Monkeypox Cases

Monkey pox is the most feared disease after Corona. Cases of monkey pox are breaking out all over the world and disturbing everyone. As monkey pox cases came to light in India, everyone started panicking. The country's first case of monkey pox was registered in Kerala, and the central government was alerted as concerns were expressed across the country. Key suggestions on precautions to be taken in case of monkey pox. The Union Health Department has released guidelines especially for travelers going abroad and those returning from abroad. In this order, another monkeypox positive case has been reported in the country. Another case of monkeypox virus infection has been reported in Kerala, the state's health minister Veena George said on Monday.

The Kerala government is on high alert to prevent the spread of monkeypox. Special warnings have been issued to five districts. Another case of monkeypox was reported in Kerala within two days of the case of monkeypox in the southern state of Kerala. A person who had arrived on a Sharjah-Thiruvananthapuram Indigo flight tested positive for monkeypox. State Health Minister Veena George said that a special alert has been issued to those five districts as travelers from Thiruvananthapuram, Kollam, Pathanamthitta, Alappuzha and Kottayam arrived with the person infected with the virus.

Telugu Version

కరోన తర్వాత అంతగా భయపెడుతున్న వ్యాధి మంకీ పాక్స్. ప్రపంచవ్యాప్తంగా మంకీ పాక్స్ కేసులు బయటపడుతూ అందరినీ కలవరపెడుతున్నాయి. భారత్లోనూ మంకీ పాక్స్ కేసులు వెలుగులోకి రావటంతో అందరిలోనూ భయాందోళన మొదలైంది. దేశం తొలి మంకీ పాక్స్ కేసు కేరళలో నమోదుకావడం, దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం కావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మంకీ పాక్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కీలక సూచనలు చేసింది. ముఖ్యంగా విదేశాలకు వెళ్లే ప్రయాణికులు, విదేశాల నుంచి తిరిగి వస్తున్నవారి కోసం కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ క్రమంలోనే దేశంలో తాజాగా మరో మంకీపాక్స్ పాజిటివ్ కేసు నమోదైంది. కేరళలో మంకీపాక్స్ వైరస్ సోకిన మరో కేసు నమోదైందని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ సోమవారం తెలిపారు.

మంకీపాక్స్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి కేరళ ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. ఐదు జిల్లాలకు ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణాది రాష్ట్రం కేరళలో మంకీపాక్స్ కేసు నమోదైన రెండు రోజుల వ్యవధిలోనే కేరళలో మరో మంకీపాక్స్ కేసు నమోదుకావటం కలకలం రేపుతోంది. షార్జా-తిరువనంతపురం ఇండిగో విమానంలో వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. వైరస్ సోకిన వ్యక్తితో కలిసి తిరువనంతపురం, కొల్లాం, పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయంకు చెందిన ప్రయాణికులు రావటంతో ఆ ఐదు జిల్లాలకు ప్రత్యేక హెచ్చరిక జారీ చేసినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens