In the Gulf countries, Ramadan is being celebrated with devotion. As the crescent moon appears on Thursday, the festival is held on Friday. However, if the crescent moon is sighted in our country on Friday, the festival of Ramzan will be held on Saturday. Otherwise, the Muslim elders announced that the festival will be held on Sunday.
Mufti Mohammad Khalil Ahmed, the representative of the Ruhiyate Hilal Committee (Moon Crescent Determination Committee) has revealed that if the crescent moon is sighted on Friday, Ramadan should be celebrated on Saturday. He advised the Muslims that the Ruhiyate Hilal Committee would clarify the matter by 7 pm on Friday and celebrate the festival accordingly.
If this is the case, the last Friday of the month of Ramadan is given more importance in Islam. On this day Muslims perform special prayers and receive blessings. Arrangements were made at all the mosques in Hyderabad to celebrate Jummatul Vidah. GHMC officials said that special arrangements have been made for Jummatul Vidah prayers at Makkah Masjid and Royal Mosque in Public Gardens. Apart from this, the vicinity of the mosque under the GHMC has also been cleaned, he said.
Arrangements for Namaz in Eidgahs
State Waqf Board Chairman Masiullah Khan disclosed on Thursday that all arrangements are being made for collective prayers in all Eidgahs within Greater Hyderabad in the context of Ramzan festival. He also said that orders have been issued to complete the arrangements in time in the elections across the state.
Telugu version
గల్ఫ్ దేశాల్లో రంజాన్ పర్వదిన వేడుకులు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. గురువారం నెలవంక కనిపించడంతో శుక్రవారం పండుగ నిర్వహిస్తున్నారు. అయితే, మనదేశంలో శుక్రవారం నెలవంక కనిపిస్తే శనివారం రంజాన్ పండుగ జరగనుంది. లేకపోతే.. ఆదివారం పండుగ జరుగుతుందని ముస్లిం పెద్దలు ప్రకటించారు.
శుక్రవారం నెలవంక దర్శనమిస్తే.. శనివారం రమదాన్ పండుగ జరుపుకోవాలని.. లేకపోతే.. ఆదివారం పండుగను నిర్వహించుకోవాలని రుహియతే హిలాల్ కమిటీ (నెలవంక నిర్ధారణ కమిటీ )ప్రతినిధి ముఫ్తీ మహ్మద్ ఖలీల్ అహ్మద్ వెల్లడించారు. రుహియతే హిలాల్ కమిటీ శుక్రవారం సాయంత్రం 7 గంటల వరకు దీనిపై స్పష్టతనిస్తుందని, దాని ప్రకారం పండుగ జరుపుకోవాలని ఆయన ముస్లింలకు సూచించారు.
ఇదిలాఉంటే.. ఇస్లాంలో రంజాన్ మాసం చివరి శుక్రవారానికి ఎక్కువ ప్రధాన్యం ఇస్తారు. ఈ రోజు ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆశీస్సులు పొందుతారు. జుమ్మతుల్ విదాను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని అన్ని మసీదుల వద్ద ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా మక్కా మసీదు, పబ్లిక్ గార్డెన్స్‌లోని రాయల్ మసీదులో జుమ్మతుల్ విదా ప్రార్థనలకు ఏర్పాట్లు చేసినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. దీంతోపాటు జీహెచ్ఎంసీ పరిధిలోని మసీదు పరిసరాలను కూడా శుభ్రం చేసినట్లు తెలిపారు.
ఈద్గాలలో నమాజ్ కోసం ఏర్పాట్లు
రంజాన్ పండుగ నేపథ్యంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని ఈద్గాలలో సామూహిక ప్రార్థనల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు గురువారం రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ మసీవుల్లా ఖాన్ వెల్లడించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఈద్గాలలో కూడా సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.