TTD appeals to devotees to observe restraint in Tirumala two days for darshan

Tirumala Srivari Darshananika Bhaktakoti is lined up. Devotees flocked to Tirumala as it was a consecutive holiday. Obviously a busy time. In that too...the number of Tirumala devotees has increased massively as the employees got consecutive holidays. People flock to Tirumala from distant shores to pay their prayers... Huge number of devotees are standing in the queue waiting for divine darshan. Sarva Darshan Qline reaches Gogarbham Dam.

Devotees especially flock to Tirumala as it is a four-day holiday. At present it takes 48 hours for darshan of Srivari. With the coming of successive holidays and the completion of the inter examinations, people flocked to Tirumala in large numbers. With this, Tirumala Girulu became a devotee.

The TTD officials have repeatedly appealed to the tokenless devotees in the Sarva Darshan queue to exercise restraint. On the other hand, the TTD officials appealed to the devotees to plan the Tirumala yatra keeping in mind the rush of devotees in Tirumala.

Telugu version

తిరుమల శ్రీవారి దర్శనానిక భక్తకోటి బారులు తీరుతోంది. వరుస సెలవులు కావడంతో తిరుమలకు పోటెత్తారు భక్తులు. సహజంగానే రద్దీ ఉండే సమయం. అందులోనూ…ఉద్యోగులకు వరుస సెలవులు లభించడంతో తిరుమల భక్తుల రద్దీ భారీగా పెరిగింది. తిరుమల ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు…తమ మొక్కులు చెల్లించుకునేందుకు సుదూర తీరాల నుంచి జనం తిరుమలకు తరలివస్తున్నారు. భారీగా భక్తులు క్యూలైన్‌లో నిలుచుని దైవ దర్శనానికి ఎదురుచూస్తున్నారు. ఇక గోగర్భం డ్యామ్ వరకు చేరుకుంది సర్వ దర్శన క్యూలైన్.

నాలుగు రోజులు సెలవుదినాలు కావడంతో తిరుమలకు విశేషంగా తరలి వస్తున్నారు భక్తులు. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి 48 గంటల సమయం పడుతోంది. వరస సెలవులు రావడం.. ఇంటర్ పరీక్షలు పూర్తి కావడంతో ప్రజలు భారీగా తిరుమల బాటపట్టారు. దీంతో తిరుమల గిరులు భక్త సంద్రంగా మారింది.

సర్వ దర్శనం క్యూలైన్ లో ఉన్న టోకెన్ లేని భక్తులు సంయమనం పాటించాలని టీటీడీ అధికారులు పదే పదే విజ్ఞప్తి చేశారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల యాత్రకు ప్లాన్ చేసుకోవాలని భక్తులకు టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens