Tiger died after being hit by electric fence.. Villagers cooked and ate it.. This is the reaction of forest officers.

The news that some people cooked and ate a tiger that died after getting caught in an electric fence in Yarragondapalem forest area of ​​Prakasam district in Andhra Pradesh created a sensation. But Yarragondapalem forest officials said that they are all rumours. Ten days ago, three tigers were spotted coming and going to a waterhole in the forest near Akkapalem. The neighboring farmers have been alerted.

 He said that they have investigated the news that the tiger was cooked and eaten from all angles. They explained that their houses were also searched and no traces were found anywhere. However, as the authorities announced that there are tigers in this area, trap cameras were installed. Days passed but they were not found. Due to this, doubts are being expressed as to whether there are real tigers or not.

However, according to the news that is going viral on social media, the tiger died after hitting the fence built by the farmers around the farm to protect the crops. Some locals who came to know the matter cooked the tiger meat and ate it. The matter came to light when there were differences between them regarding the sending of tiger claws. After getting the information, the forest officials started an investigation. It seems that 12 people have been found to have eaten tiger meat.

Telugu version

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం అటవీ ప్రాంతంలో విద్యుత్ కంచెకు తగిని మృతి చెందిన పులిని.. కొందరు వండుకుని తిన్నారన్న వార్తలు సంచలనం కలిగించాయి. అయితే అవన్నీ వదంతులేనని యర్రగొండపాలెం అటవీ క్షేత్రాధికారులు తెలిపారు. అక్కపాలెం సమీపంలోని అడవిలోని నీటి కుంట వద్దకు పది రోజుల క్రితం మూడు పులులు వచ్చి వెళ్లినట్టు గుర్తించామన్నారు. దీంతో చుట్టు పక్కల రైతులను అప్రమత్తం చేశామన్నారు.

 పులిని వండుకుని తిన్నారన్న వార్తలపై అన్ని కోణాల్లోనూ విచారణ చేశామన్నారు. వారి ఇళ్లల్లోనూ సోదాలు చేశామని, ఎక్కడా ఎలాంటి ఆనవాళ్లు లభించలేదని వివరించారు. అయితే.. ఈ ప్రాంతంలో పులులు ఉన్నాయని అధికారులు ప్రకటించడంతో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. రోజులు గడుస్తున్నా వాటి ఆచూకీ లభించలేదు. దీంతో అసలు పులులున్నాయా లేదా.. ఉంటే ఏమయ్యాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం పంటలను కాపాడుకునేందుకు పొలం చుట్టూ రైతులు వేసిన కంచె తగిలి పులి చనిపోయింది. విషయం తెలుసుకున్న కొందరు స్థానికులు పులి మాంసాన్ని వండుకుని తినేశారు. పులి గోళ్ల పంపకాల విషయంలో వారి మధ్య విబేధాలు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు విచారణ చేపట్టారు. 12 మంది పులి మాంసం తిన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens