A sad day in the history of India, February 14, 2019, 40 soldiers were killed in a suicide attack while they were happily spending time with their family members and protecting Mother India .
At one time 40 jawans were removed from the country. He reached eternal sleep in the lap of Bharata Mata.
Four years have passed since a suicide attack on a convoy of Central Reserve Police Force (CRFP) personnel on the National Highway in Srinagar.
Telugu version
భారత చరిత్ర పుటల్లో దుర్దినంగా నిలిచిన రోజు 2019 ఫిబ్రవరి 14, తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపి భరతమాత రక్షణ కోసం ఆనందంగా విధులకు వెళ్తున్న సమయంలో ఒక ఆత్మాహుతి దాడి చేసిన పనికి 40 మంది జవాన్లు అమరులైన రోజు.. అవును జమ్మూకాశ్మీర్ లో పుల్వామా దాడి తో దేశం ఒక్కసారి ఉలిక్కి పడింది.
ఒకే సారి 40 మంది జవాన్లను దేశం దూరం చేసుకుంది. భరతమాత ఒడిలో శాశ్వత నిద్రకు చేరుకున్నారు. శ్రీనగర్ జాతీయ రహదారిలో పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRFP) సిబ్బంది కాన్వాయ్ మీద ఆత్మాహుతి దాడి చేసి నేటికీ నాలుగు సంవత్సరాలు పూర్తయ్యాయి.