How much does a regular cup of coffee cost? If it is big, it will be Rs.20 or up to Rs.50. But in this restaurant, the price of a cup of coffee is more than three lakh rupees.
Ever wonder if this coffee is a specialty? There is nothing special about coffee. When he arrived, everything was with the restaurant. Usually, if we go to restaurants, we eat coffee along with other snacks. The restaurant billed a total of Rs.3,66,915 for coffee with snacks. Currently, a bill related to this is going viral.
We are talking about the Starbucks restaurant in Oklahoma, USA. An American couple named Jessie and Dee Dee O'Dell had a habit of going to Starbucks every morning for the past 16 years and drinking two cups of hot coffee.
Even those who pay 10 dollars for that. As always, this couple who went to Starbucks restaurant last month and drank coffee, their eyes widened when they saw the bill.
Why did they charge such a bill? They replied that if the ownership of Starbucks was suspended, they would have to pay the coffee bill as well as the gratuity fee. The American couple complained to the police.
Starbucks later realized that the problem was due to a technical error and took corrective action. The couple took to social media to share their bitter experience of having to check the bill later when going to restaurants.
Telugu Version
మామూలుగా కప్పు కాఫీ ఖరీదెంతుంటుంది..? మహా అయితే రూ.20 లేదంటే రూ.50ల వరకు ఉంటుంది. ఐతే ఈ రెస్టారెంట్‌లో మాత్రం కప్పు కాఫీ ధర ఏకంగా మూడు లక్షల రూపాయలకుపైమాటే. ఏంటటా ఈ కాఫీ స్పెషాలిటీ అని అనుకుంటున్నారా? కాఫీలో స్పెషల్ ఏమీ లేదు. వచ్చిన తంటా అంతా రెస్టారెంట్‌తోనే ఉంది.
సాధారణంగా రెస్టారెంట్లకు వెళ్తే సరదాగా కాఫీతోపాటు ఇతర స్నాక్స్ కూడా తింటుంటాం. కాఫీ విత్ స్నాక్స్‌కు కలిపి సదరు రెస్టారెంట్ ఏకంగా రూ.3,66,915ల బిల్లు వేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన బిల్లు నెట్టింట వైరల్ అవుతోంది.
అమెరికాలోని ఓక్లహోమాలోనున్న స్టార్‌బక్స్ రెస్టారెంట్ గురించే మనం చర్చిస్తోంది. జెస్సీ, డీడీ ఓ’డెల్ అనే అమెరికా జంట గత 16 ఏళ్లుగా ప్రతి రోజూ ఉదయం స్టార్‌బక్స్‌కి వెళ్లి రెండు కప్పులు వేడి వేడి కాఫీ తగడం అలవాటు. అందుకు 10 డాలర్లు చెల్లించేవారు కూడా. ఈ క్రమంలో ఎప్పటి మాదిరిగానే గత నెలలో స్టార్‌బక్స్ రెస్టారెంట్‌కు వెళ్లి కాఫీ తాగిన ఈ జంటకు బిల్లును చూడంగానే కళ్లు బైర్లు కమ్మాయట. ఇంత బిల్లు ఎందుకేశారని స్టార్‌బక్స్ యాజమన్యాన్ని నిలదీస్తే కాఫీ బిల్లుతోపాటు గ్యాట్యుటీ రుసుము కూడా చెల్లించవల్సిందేనని తాపీగా బదులిచ్చారు. దీంతో అమెరికా దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తర్వాత సాంకేతక లోపం కారణంగా సమస్య తలెత్తిందని గ్రహించిన స్టార్‌బక్స్ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు బిల్లును తరవుగా చెక్ చేసుకోవాలని తమ కెదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా ఈ జంట పంచుకుంది.