Teaching jobs in central government school.

Atomic Energy Central Schools has issued a notification for filling up various posts. Vacancies in this central government school in Hyderabad ECIL will be filled. It will be taken on contract basis for the year 2023-24. In which departments there are vacancies.? How to apply? Full details like this are for you..

* As part of the notification, the posts of Preparatory Teachers, Primary Teachers, PRT (Telugu), TGT (Maths, Physics, Chemistry, Biology, Social Science, English, Hindi, Sanskrit, PET, Art) will be filled.

* Candidates applying for the above mentioned posts should have passed Intermediate, DELED, Degree, PE, BED in the respective department.

* Candidates applying for Preparatory Teacher and PRT posts should not be more than 30 years of age and 35 years of age for TGT posts.

Important things..
* Interested and eligible candidates have to apply online.

* Candidates will be selected on the basis of written test and skill test.

* Those selected for Preparatory Teacher and PRT posts will be paid Rs.21250 per month and Rs.26250 for TGT posts.

* After applying online, hard copies should be sent to Security Office, DAE Colony Entrance, D-Sector Gate, Kamalanagar, ECIL Post, Hyderabad.

* The last date for receipt of applications is fixed as 21-02-2023.

Telugu version

అటామిక్‌ ఎనర్జీ సెంట్రల్‌ స్కూల్స్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. హైదరాబాద్‌ ఈసీఐఎల్‌లోని ఈ కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. 2023-24 ఏడాదికి గాను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా ప్రిపరేటరీ టీచర్స్, ప్రైమరీ టీచర్స్, పీఆర్‌టీ (తెలుగు), టీజీటీ(మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సోషల్ సైన్స్, ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, పీఈటీ, ఆర్ట్) పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, డీఈఎల్‌ఈడీ, డిగ్రీ, పీ,ఈ బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.

* ప్రిపరేటరీ టీచర్‌, పీఆర్‌టీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 30 ఏళ్లు, టీజీటీ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ప్రిపరేటరీ టీచర్, పీఆర్‌టీ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.21250, టీజీటీ పోస్టులకు రూ.26250 జీతంగా చెల్లిస్తారు.

* ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత హార్డ్‌ కాపీలను సెక్యూరిటీ ఆఫీస్, డీఏఈ కాలనీ ఎంట్రన్స్‌, డి-సెక్టార్ గేట్, కమలానగర్, ఈసీఐఎల్‌ పోస్ట్, హైదరాబాద్‌ చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 21-02-2023ని నిర్ణయించారు.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens