తిలక్ వర్మ రిటైర్డ్ హర్ట్... సూర్యకుమార్ షాక్... వీడియో వైరల్!
లక్నో వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG), ముంబయి ఇండియన్స్ (MI) పై 12 పరుగుల తేడాతో గెలిచింది.
ఈ మ్యాచ్‌లో ఆశ్చర్యకరమైన ఘటన ఏంటంటే, తిలక్ వర్మ ఆట మధ్యలో రిటైర్డ్ హర్ట్ కావడం. ఈ విషయాన్ని కోచ్ జయవర్ధనె ముందుగా సూర్యకుమార్ యాదవ్‌కు చెప్పగా, అతడు షాక్ అయ్యాడు. "ఎందుకు?" అన్నట్లు ఇచ్చిన రియాక్షన్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
తిలక్ వెనుదిరిగిన తర్వాత మిచెల్ శాంట్నర్ క్రీజులోకి వచ్చాడు కానీ కేవలం రెండు బంతులే ఆడాడు. ఈ నిర్ణయం పై అభిమానులు మండిపడుతున్నారు. ఆటగాడి కాన్ఫిడెన్స్‌కి ఇది మైనస్ అంటున్నారు.
గత సీజన్‌లో తిలక్ వర్మ 416 పరుగులు చేసి రోహిత్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్. అంతేకాదు, ఇండియా తరఫున టీ20ల్లో రెండు సెంచరీలు, మొత్తం 25 మ్యాచ్‌ల్లో 749 పరుగులు చేసిన రికార్డు ఉంది.
ఇలాంటి ఆటగాడిని మద్యలో వెనక్కి రప్పించి అవమానించారనే భావనతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే, లక్నో ఇచ్చిన 203 పరుగుల లక్ష్యాన్ని ముంబయి ఛేదించలేకపోయింది. 20 ఓవర్లలో 191 పరుగులు మాత్రమే చేసింది. హార్దిక్ పాండ్యా 28 పరుగులు చేసి, 5 వికెట్లు తీసినప్పటికీ, జట్టును గెలిపించలేకపోయాడు.