Ambedkar Konaseema District I.Polavaram Mandal An auto which was taking tenth class students to the examination overturned at old Injaram village causing a commotion.
Students of class 10 left for school in the morning by auto to write their exams. The accident took place while I.Polavaram was going from G.Mulapalem. There were 8 students in the auto. One of them sustained serious injuries while the remaining seven sustained minor injuries.
Locals and police took the injured to the Yanam Government Hospital in an ambulance. After treating all the students, the police sent seven students for examination. Another student was seriously injured and could not go for the exam.
Telugu version
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం పాత ఇంజరం గ్రామం వద్ద పదవ తరగతి విద్యార్థులను పరీక్షకు తీసుకెళ్తు్న్న ఆటో బోల్తా పడటం కలకలం రేపింది. పరీక్షలు రాసేందుకని పదవ తరగతి విద్యార్థులు ఉదయం పాఠశాలకు ఆటోలో బయలుదేరారు. జి.మూలపాలెం నుండి ఐ.పోలవరం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోలో 8 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో ఒకరికి తీవ్ర గాయాలవ్వగా మిగిలిన ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి.
దీంతో క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు అంబులెన్స్‌లో యానం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులందరికి చికిత్స అందిచాక ఏడుగురు విద్యార్థులను పోలీసులు పరీక్షకు పంపించారు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో అతను పరీక్షకు రాసేందుకు వెళ్లలేకపోయాడు.