SSC 2025లో 600/600 మార్కులతో చరిత్ర సృష్టించిన యాళ్ళ నెహాంజని – Mana Voice Global Media నుంచి ఘన సత్కారం
SSC 2025 ఫలితాల్లో పూర్తిగా 600/600 మార్కులు సాధించి, 10వ తరగతి చరిత్రలో ఎన్నడూ లేని ఘనత సాధించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ టాపర్ యాళ్ళ నెహాంజని ని, ఆమె తల్లి తండ్రులతో కలిసి Mana Voice Global Media హైదరాబాద్ స్టూడియోలో ఘనంగా సత్కరించాము. ఈ అసాధారణ విజయాన్ని సాధించడంలో నెహాంజని శ్రమ, పట్టుదల, తల్లి తండ్రుల మద్దతు, మరియు మంచి గైడెన్స్ ప్రధాన పాత్ర పోషించాయి. ఆమె మరియు ఆమె కుటుంబ సభ్యులతో జరిగిన చర్చలో ఈ విజయం వెనుక ఉన్న ప్రయాణం, ప్రతిరోజూ చేసే స్టడీ ప్లాన్, ఫోకస్, మోటివేషన్ గురించి మేము తెలుసుకున్నాము. ఇటువంటి విజయం ప్రస్తుత విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందని భావిస్తూ, నెహాంజని భవిష్యత్తు విద్యలో మరిన్ని విజయాలు సాధించాలని Mana Voice తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
మీ.. యాళ్ల వర ప్రసాద్ & టీం