Srileela: బాలీవుడ్ సినిమాకు శ్రీలీల ఎంత పారితోషికం అందుకుందంటే..!?

శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ: పారితోషికంగా ఎంత తీసుకుందంటే..?

తెలుగులో ఒక్కో సినిమాకు రూ. 3 కోట్లు తీసుకుంటున్న శ్రీలీల, బాలీవుడ్‌లో తన తొలి సినిమాకు కేవలం రూ. 1.75 కోట్లు మాత్రమే అందుకుందట. ‘పెళ్లి సందడి’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఆమె, స్టార్ హీరోల సరసన నటిస్తూ క్రేజ్ సంపాదించుకుంది. కొన్ని ఫ్లాపుల తర్వాత, ‘పుష్ప 2’ ఐటెం సాంగ్‌తో తిరిగి ట్రెండింగ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం ఆమెకు కొత్త అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి.

తాజాగా, శ్రీలీల ఓ బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. అయితే ఈ సినిమా కోసం ఆమె తక్కువ పారితోషికం మాత్రమే తీసుకుందట. బాలీవుడ్‌లో కొత్తగా అడుగుపెడుతున్నందున, తక్కువ రెమ్యునరేషన్‌కి ఒప్పుకుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, రష్మిక మందన్న తన బాలీవుడ్ మూవీ ‘చావా’ కోసం రూ. 4 కోట్లు పారితోషికంగా అందుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens