When a snake was seen in the train, the passengers ran here and there in fear. All the passengers shouted and shouted and made a lot of noise in the train. While some shouted that the snake should be killed, others did not and asked to inform the forest department. The snake rattled in the fast moving express train. This incident came to light in Kerala. If we go into the details..
A snake was spotted by passengers in the S5 compartment of the Thiruvananthapuram-Nizamuddin Express train on Wednesday night. So they complained to their TT. Passengers said the snake was spotted at the luggage under the berth after the train passed Tirur station. A photo of a snake taken on a mobile phone was also shown. On receiving the information, the Kozhikode railway station officials stopped the train at that station at 10.15 pm.
After evacuating all the passengers in the S5 compartment, two persons holding snakes were brought and searched. But the snake was not seen. He said it might have gone through the hole in the compartment or it might have been hidden there. But the staff who saw the photo of the snake said that it was not that dangerous. Later that hole was closed. The train left after midnight.
Telugu Version
రైలులో పాము కనిపించడంతో ప్రయాణికులు భయంతో అటు ఇటూ పరుగులు తీశారు. ప్రయాణికులంతా అరుపులు కేకలు వేస్తూ రైల్లో నానా రచ్చ చేశారు. కొందరు పామును కొట్టి చంపేయాలని అరుస్తుంటే, మరికొందరు కాదు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సమాచారం అందించాలని కోరారు. ఇలా వేగంగా వెళ్తోన్న ఎక్స్ప్రెస్ రైల్లో పాము హల్చల్ చేసింది. ఈ ఘటన కేరళలో వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే..
బుధవారం రాత్రి తిరువనంతపురం-నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ రైలులోని ఎస్ 5 కంపార్ట్మెంట్లో ప్రయాణికులకు పాము కనిపించింది. దాంతో వారి టీటీకి ఫిర్యాదు చేశారు. రైలు తిరుర్ స్టేషన్ దాటిన తర్వాత బెర్త్ కింద ఉన్న లగేజ్ వద్ద పాము కనిపించిందని ప్రయాణికులు తెలిపారు. మొబైల్లో తీసిన పాము ఫొటో కూడా చూపించారు. సమాచారం అందుకున్న కోజికోడ్ రైల్వే స్టేషన్ అధికారులు రాత్రి 10.15 గంటలకు రైలును ఆ స్టేషన్లో నిలిపివేశారు.
ఎస్ 5 కంపార్ట్మెంట్లోని ప్రయాణికులందరిని ఖాళీ చేయించి.. పాములు పట్టే ఇద్దరు వ్యక్తులను రప్పించి వెతికించారు. అయితే ఆ పాము కనిపించలేదు. కంపార్ట్లోని హోల్ ద్వారా అది వెళ్లిపోయి ఉండవచ్చు లేదా అక్కడ దాగి ఉండవచ్చని అన్నారు. అయితే పాము ఫొటోను చూసిన సిబ్బంది అది అంత ప్రమాదం కాదని తెలిపారు. అనంతరం ఆ హోల్ను మూసివేశారు. అర్ధ రాత్రి తర్వాత ఆ రైలు అక్కడి నుంచి కదిలింది.