సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష 2025: ఏప్రిల్ 5న AISSEE పరీక్ష – అడ్మిట్ కార్డులు విడుదల
ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (AISSEE) 2025 ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 5న నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ మరియు 9వ తరగతులలో ప్రవేశాలు కల్పించనున్నారు.
ఈ పరీక్షను OMR ఆధారిత ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. తాజాగా హాల్ టికెట్‌లు విడుదల అయ్యాయి. విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్ & పుట్టిన తేదీని నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 5న NTA దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది.
ఏపీ రాష్ట్రంలో ఉద్యోగ మేళాలను నిర్వహించేందుకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో త్వరలో జరగనున్న కలెక్టర్ల సమావేశానికి ముందు ఉద్యోగ మేళాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రతి మూడు లేదా ఆరు నెలలకొకసారి ఉద్యోగ మేళాలను నిర్వహించాలని ఆయన సూచించారు.
నైపుణ్య గణన ప్రక్రియ ఆలస్యం కావడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను వేగంగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి జోన్‌కు ఒక ప్రభుత్వ లేదా ప్రైవేట్ యూనివర్సిటీని నోడల్ ఏజెన్సీగా గుర్తించాలన్నారు.
అలాగే స్థానిక పరిశ్రమల భాగస్వామ్యంతో నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. వర్క్ ఫ్రం హోమ్ విధానంలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని, ఆన్‌లైన్ & ఆఫ్‌లైన్ శిక్షణలను వెంటనే ప్రారంభించాలని సూచించారు.
తాజాగా నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో, మంత్రి లోకేశ్ మాట్లాడుతూ క్లస్టర్ ఆధారిత శిక్షణ ఇప్పటికే ప్రారంభించామని, మూడు నెలలకోసారి ఉద్యోగ మేళాలు నిర్వహిస్తామని తెలిపారు.