Rock Star Yash as a Guest Role in Prabhas Salar Movie

English Version

Young rebel star Prabhas is currently busy with a series of Pan India films. Salar movie is one of them. Expectations are high on this movie directed by sensational director Prashant Neel. Shruti Haasan is acting opposite Prabhas in this film. Hombale Films is producing this film. But while many updates are already going viral on this movie, another interesting news is doing the rounds in the film circle. According to the latest buzz, another Pan India star is acting in this movie.

He is none other than Kannada rock star Yash. There is talk that Yash will be seen in a guest role in the movie Salaar. With this, the expectations of the film Salaar have reached a peak. Darling fans have made a lot of noise saying that the upcoming movie Salaar in the successful director combo of two Pan India stars is going to be in a range. It is a well-known fact that the recent Yash and Prashant Neel combo KGF 2 created a sensation at the box office. KGF movie created a record in terms of collections regardless of South and North. Yash gained craze as Pan Indian COO of this movie. Now that Prabhas and Yash will be seen in the same film, the expectations of Salaar's film have increased. It is known that an official announcement regarding this will come soon.

Telugu Version

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అందులో సలార్ సినిమా ఒకటి. సెన్సెషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇందులో ప్రభాస్ జోడిగా శ్రుతి హాసన్ నటిస్తుండగా.. హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. అయితే ఈ మూవీపై ఇప్పటికే పలు అప్డేట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. తాజాగా ఫిల్మ్ సర్కిల్లో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. లేటేస్ట్ బజ్ ప్రకారం ఈ మూవీలో మరో పాన్ ఇండియా స్టార్ నటిస్తున్నాడట..

అతను మరెవరో కాదు.. కన్నడ రాక్ స్టార్ యశ్. సలార్ సినిమాలో యశ్ అతిథి పాత్రలో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. దీంతో సలార్ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కాంబోలో రాబోతున్న సలార్ మూవీ ఏ రెంజ్ లో ఉండబోతుందో అంటూ డార్లింగ్ ఫ్యాన్స్ నెట్టింట సందడి షూరు చేశారు. ఇటీవలే యశ్, ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన కేజీఎఫ్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో తెలిసిన విషయమే. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా కలెక్షన్ల విషయంలో రికార్డ్ సృష్టించింది కేజీఎఫ్ మూవీ. ఈ సినిమా పాన్ ఇండియాన్ సీఓవోగా క్రేజ్ సంపాందించుకున్నాడు యశ్. ఇప్పుడు ప్రభాస్, యశ్ ఒకే సినిమాలో కనిపించనుండడంతో సలార్ సినిమా అంచనాలు మరింత పెరిగాయి. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానునట్లు తెలుస్తుంది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens