Ram Charan Wife Upasana Questions Sadguru about Her children

English Version

Mega Power Star Ram Charan's wife Upasana needs no special introduction. Apart from Ram Charan's wife, she has earned a special identity for herself as a businessman. Upasana, who is serving as the vice-chairperson of Apollo Life, is working for the development of the company with his ideas. Upasana, who is always active on social media, has recently been questioned by netizens about her children. But recently Upasana mentioned the same thing to spiritual teacher Sadhguru. Along with this question three more questions were asked. So what are those questions? Sadhguru's answer to that is..

On this occasion, Upasana said.. 'It has been ten years since my marriage. I am living a very happy married life. I love my family and my life so much. But some are asking about RRR in my life. The first one is about my relationship, the second one is about my ability to reproduce (the ability to bear children), the third one is about my role in life, people are asking about these. But Sadhguru answered these questions in his own style.

Answering upasana questions.. 'Relationship is your personal matter. No one should pry into it. The second is to reproduce.. I award those who do not have children This generation definitely does not need to have children. Because the population of this world has already increased too much. If you become a tigress, I would definitely advise you to have cubs. Because they are becoming extinct. But we are not dying. We are already in large numbers on this earth', he said. After listening to this answer given by Sadhguru, Upasana.. If you listen to this advice given by you.. you will get calls from my mother's in-laws.

Telugu Version

మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ భార్య ఉపాసన పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. రామ్‌ చరణ్‌ భార్యగానే కాకుండా వ్యాపార వేత్తగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అపోలో లైఫ్‌కు వైస్‌ ఛైర్‌ పర్సన్‌గా సేవలదించిస్తోన్న ఉపాసన తన ఆలోచనలతో సంస్థ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఇక సోషల్‌ మీడియాలోనూ నిత్యం యాక్టివ్‌గా ఉండే ఉపాసనకు ఇటీవలి కాలంలో తన సంతానం గురించి నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే తాజాగా ఇవే విషయాన్ని ఆధ్యాత్మిక గురువు సద్గురుతో ప్రస్తావించారు ఉపాసన. ఈ ప్రశ్నతో పాటు మరో మూడు ప్రశ్నలను సంధించారు. ఇంతకీ ఆ ప్రశ్నలు ఏంటి.? దానికి సద్గురు ఇచ్చిన సమాధానం ఏంటంటే..

ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ.. ‘నా వివాహం జరిగి పదేళ్లు గడుస్తోంది. వైవాహిక జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్నాను. నా కుటుంబాన్ని, నా జీవితాన్ని నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. కానీ కొందరు నా జీవితంలో ఆర్‌ఆర్‌ఆర్‌ గురించి అడుగుతున్నారు. ఇందులో మొదటిది నా రిలేషన్‌ గురించి, రెండోది రీ ప్రొడ్యూస్‌ (పిల్లలను కనే సామర్థ్యం), మూడో ఆర్‌.. జీవితంలో నా రోల్‌.. వీటి గురించే జనాలు ప్రశ్నిస్తున్నారు’ అని చెప్పుకొచ్చింది. అయితే ఈ ప్రశ్నలకు సద్గురు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

ఉపాసన ప్రశ్నలకు బదులిస్తూ.. ‘బంధం మీ వ్యక్తిగత విషయం. అందులో ఎవరూ తలదూర్చకూడదు. రెండోది రీప్రొడ్యూస్‌.. పిల్లలను కనకుండా ఉండే వారికి నేను అవార్డులిస్తాను. ఈ తరం వాళ్లు కచ్చితంగా పిల్లల్ని కనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఈ ప్రపంచ జనాభా మరీ పెరిగిపోయింది. ఒకవేళ నువ్వు ఆడ పులివి అయ్యుంటే మాత్రం కచ్చితంగా పిల్లల్ని కనమని సలహా ఇచ్చేవాడిని. ఎందుకంటే అవి అంతరించిపోతున్నాయి. కానీ మనం అంతరించడం లేదు. ఇప్పటికే మనం ఈ భూమి మీద ఎక్కువ సంఖ్యలో ఉన్నాం’ అని చెప్పుకొచ్చారు. దీంతో సద్గురు చెప్పిన ఈ సమాధానం విన్న ఉపాసాన.. మీరు చెప్పిన ఈ సలహా వింటే.. మీకు మా అమ్మ అత్తయ గార్ల నుంచి ఫోన్లు వస్తాయి. 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens