రజినీకాంత్ - లోకేశ్ కనకరాజ్ కాంబినేషన్‌లో ‘కూలీ’ ఆగస్టు 14న విడుదల
సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనకరాజ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం కూలీ. ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
సన్ పిక్చర్స్ సంస్థ తమ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.
లోకేశ్ కనకరాజ్ సినిమాలకు యువతలో విపరీతమైన క్రేజ్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయనకు ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్ ఉంది. అలాంటి దర్శకుడితో రజినీకాంత్ కలసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, ఆమీర్ ఖాన్ వంటి స్టార్ హీరోలు గెస్ట్ రోల్స్‌లో కనిపించనున్నారు.