PM Narendra Modi speech at Bhimavaram | Alluri Statue Inauguration

English Version

Prime Minister Narendra Modi unveiled a 30 feet bronze statue of Manyam hero Alluri Sitaramaraj at Bhimavaram on Monday. Rs. Prime Minister Modi unveiled this statue, which was installed at a cost of 30 crores, through virtual. Many great people have sacrificed for the country. Alluri said that his sacrifice for the country is unforgettable. He fought against the British in his childhood. Modi said that all areas related to Alluri will be developed. Prime Minister Modi visited Bhimavaram in Andhra Pradesh as part of the Azadi Ka Amrit Mahotsav celebrations. After that he reached Gannavaram and from there went to Gujarat. On this occasion, Prime Minister Modi honored the family members of Alluri Sitarama Raju and spoke to them specially.

After the speech, Prime Minister Modi also met the family of freedom fighter Pasala Krishna Murthy from Andhra Pradesh. Prime Minister Modi spoke exclusively to Pasala Krishna Bharti, daughter of the freedom fighter. She is 90 years old. Prime Minister Modi took her blessings on this occasion. Krishna Bharti's sister and niece also spoke with PM Modi. The Prime Minister praised Pasala Krishna Murthy's services in the freedom struggle as memorable.

Telugu Version

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోడీ సోమవారం భీమవరంలో ఆవిష్కరించారు. రూ. 30 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని వర్చువల్ ద్వారా ప్రధాని మోడీ ఆవిష్కరించి మాట్లాడారు. ఎందరో మహానుభావులు దేశం కోసం త్యాగం చేశారని.. అల్లూరి సీతారామరాజు యావత్ దేశానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అల్లూరి దేశం కోసం చేసిన త్యాగం మరువలేనిదని.. చిన్నతనంలోనే ఆంగ్లేయులతో పోరాడారని పేర్కొన్నారు. అల్లూరికి సంబంధించిన అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని మోడీ పేర్కొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో పర్యటించారు. అనంతరం గన్నవరం చేరుకొని అక్కడినుంచి గుజరాత్ పయనమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ అల్లూరి సీతారామ రాజు కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించి వారితో ప్రత్యేకంగా మాట్లాడారు.

కాగా.. ప్రసంగం అనంతరం ఆంధ్రప్రదేశ్‌కి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు పసల కృష్ణ మూర్తి కుటుంబాన్ని కూడా ప్రధాని మోదీ కలిశారు. స్వాతంత్ర్య సమరయోధుడి కుమార్తె పసల కృష్ణ భారతితో ప్రధానమంత్రి మోడీ ప్రత్యేకంగా మాట్లాడారు. ఆమె వయస్సు 90 సంవత్సరాలు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోడీ ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. కృష్ణ భారతి సోదరి, మేనకోడలు కూడా ప్రధాని మోడీని కలిసి మాట్లాడారు. స్వాతంత్ర్య పోరాటంలో పసల కృష్ణ మూర్తి సేవలు చిరస్మరణీయమని  ప్రధాని కొనియాడారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens