English Version
Jana Sena Party will organize Janavani Jana Sena Bharosa program to listen to the clamor of common people in Andhra Pradesh. Jana Sena chief Pawan Kalyan will participate in the Janavani Jana Sena Bharosa program to be held at Makineni Basavapunnaya Vigyan Kendra in Vijayawada today. He will receive requests directly from the people. Pawan Kalyan's program will be held from 10 am to 3 pm. Pawan Kalyan has already reached Vijayawada. Janasena leaders and activists made all the arrangements for the program. Pawan Kalyan reached Vijayawada yesterday.
From now on, it seems that Pawan Kalyan will organize the Janavani program every Sunday to be accessible to the people. Again on the 10th, Janavani Janasena Bharosa program will be held in Vijayawada..Pawan Kalyan will hold Janavani program in Rayalaseema and Uttarandhra two weeks later. Jana Sena leaders said that the main objective of Janavani program is to take problems from the people and inform them directly to the government.
Telugu Version
ఆంధ్రప్రదేశ్ లోని సామాన్యుడి ఘోష వినేందుకు జనసేన పార్టీ జనవాణి జనసేన భరోసా కార్యక్రమాన్ని నిర్వహించనుంది. నేడు విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్న జనవాణి జనసేన భరోసా కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఆయన నేరుగా ప్రజల నుంచి నేరుగా వినతులను స్వీకరించనున్నారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్యం 3 గంటల వరకూ పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ విజయవాడ చేరుకున్నారు. కార్యక్రమం కోసం జనసేన నేతలు, కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు చేశారు. నిన్ననే పవన్ కల్యాణ్ విజయవాడ చేరుకున్నారు.
ఇక నుంచి ప్రజలకు అందుబాటులో ఉండేందుకు.. సామాన్యుడి కష్టలను తెలుసుకొనేందుకు ప్రతి ఆదివారం జనవాణి కార్యక్రమాన్ని పవన్ కల్యాణ్ నిర్వహించనున్నారని తెలుస్తోంది. మళ్ళీ 10వ తేదీన విజయవాడలో జనవాణి జనసేన భరోసా కార్యక్రమం నిర్వహించనుండగా.. తర్వాత రెండు వారాలు రాయలసీమ, ఉత్తరాంధ్రలో పవన్ కల్యాణ్ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రజల నుంచి సమస్యలను తీసుకుని నేరుగా ప్రభుత్వానికి తెలియచేయడమే జనవాణి కార్యక్రమం ముఖ్యోద్దేశ్యమని జనసేన నేతలు చెప్పారు.