On 18th of this month, IIT Council meeting was held at Bhubaneswar IIT. Union Education Minister Dharmendra Pradhan as the Chairman of the IIT Council attended the meeting along with 23 IIT Directors, Governing Body Chairmen, UGC, AICTE Chairmen. As part of the agenda, a discussion was held in the meeting on the issue of conducting a common entrance test for engineering. The Chairman of the IIT Governing Body said that the Union Minister has asked the Union Minister to study the pros and cons of this issue in depth and submit a report on the feasibility. He said that the discussion on the joint entrance examination is still going on. It is explained that it will take some time to switch from one system to another system and after taking the final decision we will give two or three years time for the common entrance test.
But if a final decision is reached on this matter, it is believed that it will be implemented from 2025-26. Also, when the issue of canceling the JEE Advanced, which is currently being conducted to fill the seats in the IITs, and bringing it into the joint engineering entrance exam was also discussed, it is reported that most of the directors and chairmen objected. There seems to be a concern that the quality of IITs will decrease due to this. On the other hand, the Center also hopes to merge NEET and JEE Mains into CUTE. UGC Chairman Acharya Jagdishkumar himself has announced this many times. If this is not possible, the Center is considering conducting a separate National Common Entrance Test for Engineering.
Telugu Version
ఈనెల 18న భువనేశ్వర్ ఐఐటీలో.. ఐఐటీ కౌన్సిల్ సమావేశం జరిగింది. దేశంలోని 23 మంది ఐఐటీల డైరెక్టర్లు, గవర్నింగ్ బాడీ ఛైర్మన్లు, యూజీసీ, ఏఐసీటీఈ ఛైర్మన్లతో పాటు ఐఐటీ కౌన్సిల్ ఛైర్మన్‌గా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎజెండాలో భాగంగా ఇంజినీరింగ్‌కు ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహించే అంశంపై సమావేశంలో చర్చ జరిగింది. ఈ అంశంపై సానుకూలతలు, ప్రతికూలతలను లోతుగా అధ్యయనం చేసి సాధ్యాసాధ్యాలపై నివేదిక సమర్పించాలని కేంద్రమంత్రి కోరినట్లు ఐఐటీ గవర్నింగ్ బాడీ ఛైర్మన్ తెలిపారు. ఈమేరకు ఉమ్మడి ప్రవేశపరీక్షపై చర్చ కొనసాగుతోందన్నారు. ఒక విధానం నుంచి మరో విధానానికి మారాలంటే కొంత సమయం పడుతుందని, చివరి నిర్ణయం తీసుకున్న అనంతరం ఉమ్మడి ప్రవేశపరీక్షకు రెండు లేదా మూడేళ్ల సమయం ఇస్తామని వివరించారు
అయితే ఒకవేళ ఈ విషయంపై తుది నిర్ణయానికి వస్తే.. 2025-26 నుంచి అమలయ్యే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. అలాగే ఐఐటీల్లో సీట్ల భర్తీకి ప్రస్తుతం జరుపుతున్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను రద్దుచేసి దాన్ని కూడా ఉమ్మడి ఇంజినీరింగ్ ప్రవేశపరీక్షలోకి తీసుకురావాలన్న అంశం కూడా చర్చకు రాగా ఎక్కువ మంది డైరెక్టర్లు, ఛైర్మన్లు అభ్యంతరం చెప్పినట్లు సమాచారం. దానివల్ల ఐఐటీల్లో నాణ్యత తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తమైనట్లు తెలుస్తోంది. మరోవైపు నీట్, జేఈఈ మెయిన్‌లను కూడా సీయూఈటీలో విలీనం చేయాలని కేంద్రం భావిస్తోంది. యూజీసీ ఛైర్మన్ ఆచార్య జగదీష్‌కుమార్ స్వయంగా ఈ విషయాన్ని పలుమార్లు ప్రకటించారు. ఒకవేళ ఇది సాధ్యం కాకుంటే ఇంజినీరింగ్‌కు ప్రత్యేకంగా జాతీయ ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహించాలని కేంద్రం ఆలోచిస్తోంది.