Monkey Pox More New Cases are Registered

English Version

The virus created by the Coraona pandemic is yet to completely subside and another virus is invading the world. Monkeypox is now trading the world. The virus, which comes to light intermittently in African countries, has now spread to many countries around the world. According to the latest World Health Organization (WHO), a total of 3400 cases have been reported worldwide. In just 11 days, 1310 new cases of monkeypox have been reported. Scientists have identified that the virus has recently spread to 8 other countries.

Has so far expanded to a total of 50 countries. Tedros Adhanom, director general of the World Health Organization, said of the monkey pox outbreak: "There are 13 cases in Australia and 4,100 cases worldwide. The number of cases that do not come out can be huge. We are deeply concerned about the threat posed by this disease. 

Meanwhile, the WHO last week decided not to declare Monkeypox a public health emergency. However, Tedros Adhanam Ghebreas, director general of the health agency, said he was "deeply concerned" about the spread of monkeypox.

Telugu Version

కరోనా మహమ్మారి (Coraona) సృష్టించిన అల్లకల్లోలం ఇంకా పూర్తిగా సద్దుమణుగక ముందే మరో వైరస్ ప్రపంచంపై దండెత్తుతోంది. మంకీపాక్స్  ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఆఫ్రికా దేశాల్లో అడపాదడపా వెలుగుల్లోకి వచ్చే ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచంలోని పలు దేశాలకు విస్తరించింది. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3400 కేసులు నమోదయ్యాయి. గడిచిన కేవలం 11 రోజుల్లోనే 1310 మంకీపాక్స్ కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్  కొత్తగా మరో 8 దేశాలకు వ్యాపించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఇప్పటి వరకు మొత్తం 50 దేశాలకు విస్తరించింది. మంకీ పాక్స్  వ్యాప్తి గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ మాట్లాడుతూ.. ‘ఆస్ట్రేలియాలో 13 కేసులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 4100 కేసులు వెలుగు చూశాయి. బయటపడని కేసుల సంఖ్య భారీగానే ఉండవచ్చు. ఈ వ్యాధి వల్ల పొంచివున్న ముప్పుపై తీవ్ర ఆందోళన చెందుతున్నాం’ అని తెలిపారు.

ఇదిలా ఉంటే డబ్ల్యూహెచ్ఓ  గత వారం మంకీపాక్స్ ను ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించకూడదని నిర్ణయించింది. అయినప్పటికీ మాత్రం మంకీపాక్స్ వ్యాప్తి గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తెలిపారు.

 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens