English Version
In the last 24 hours (Sunday) the number of corona cases was over 17 thousand. Yesterday, 17,073 cases were reported across the country. In addition, 21 people died due to the epidemic.
Corona cases have been on the rise in the country for the past few days. It is worrying that the number of cases that decreased after the third wave is rising again. In the last 24 hours (Sunday), the number of corona cases has crossed 17,000. Yesterday, 17,073 cases were reported across the country. In addition, 21 people died due to the epidemic.
Currently 94,420 (0.22 per cent) cases are active in the country. The positivity rate in the country is 4.39 per cent. The recovery rate is 98.57 per cent. To this end, the Union Ministry of Medical Health released the Health Bulletin on Monday morning. Compared to Saturday .. 45 percent of cases increased.
Corona statistics recorded in the country
- The total number of cases in the country has increased to 4,34,07,046.
- The death toll in the country has risen to 5,25,020 since Corona.
- 15,208 victims recovered from Corona yesterday. Together they numbered 4,27,87,606.
- So far 197.11 crore vaccine doses have been distributed across the country.
- 2,49,646 people were vaccinated yesterday.
- Corona tests were performed on 3,03,604 people across the country yesterday.
Telugu Version
గత 24 గంటల్లో (ఆదివారం) కరోనా కేసుల సంఖ్య 17 వేలకు పైగా నమోదైంది. నిన్న దేశవ్యాప్తంగా 17,073 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 21 మంది మరణించారు.
దేశంలో గత కొన్ని రోజుల నుంచి కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. థర్డ్ వేవ్ అనంతరం తగ్గిన కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కాగా.. గత 24 గంటల్లో (ఆదివారం) కరోనా కేసుల సంఖ్య 17 వేలకు పైగా నమోదైంది. నిన్న దేశవ్యాప్తంగా 17,073 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 21 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 94,420 (0.22 శాతం) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో పాజిటివిటీ రేటు 4.39 శాతం ఉండగా.. రికవరీ రేటు 98.57 శాతం ఉంది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. శనివారంతో పోల్చుకుంటే.. 45 శాతం కేసులు పెరిగాయి.
దేశంలో నమోదైన కరోనా గణాంకాలు..
- దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,34,07,046 కి పెరిగింది.
- కరోనా నాటి నుంచి దేశంలో మరణాల సంఖ్య 5,25,020 కి చేరింది.
- నిన్న కరోనా నుంచి 15,208 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,27,87,606కి చేరింది.
- దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 197,11 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.
- నిన్న 2,49,646 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.
- దేశవ్యాప్తంగా నిన్న 3,03,604 మందికి కరోనా పరీక్షలు చేశారు.