రికార్డ్స్ లొ మన పేరు ఉండటం కాదు మన పేరు మీద రికార్డ్స్ ఉండాలి అన్న ఒక చక్కని ఉదాహరణ,ఆమె పేరు మాధవి సూరీభట్ల,నాన్న గారు టీచర్ గా చేసి రిటైర్ అయ్యారు అమ్మ గృహిణి,అక్క అన్నయ్యలు అందరు ప్రభుత్వ ఉద్యోగులు ,ఆమె MA in Personal Management MBA in Marketing చేశారు కొన్ని సంవత్సరాలు HR Manager గా Private సంస్థ లో పనిచేసారు.
ఆమె భర్త ఒక ప్రైవేట్ సంస్థలో జనరల్ మేనేజర్ గా పని చేస్తున్నారు ,ఆమెకు 3 పిల్లలు 1 అమ్మాయి 2 అబ్బాయిల పిల్లలు సెటిల్ అయ్యాక జాబ్ మానేసి ఆమెకు వచ్చిన క్రాఫ్ట్స్ వర్క్, సంగీతం నలుగురికి నేర్పించాలి అని మధు క్రాఫ్ట్స్ &క్రియేషన్స్ తో,సోషల్ మీడియాను వేదికా చేసుకొని ఒక గ్రూప్ ఏర్పాటు చేశారు,తయారు చేసిన వస్తువులు అక్కడ పోస్ట్ చేసి ఒక మెట్టు ఏర్పాటు చేసుకున్నారు, కోవిడ్ సమయంలో Online Classes Start చేసి ఇప్పటి వరకు 600 మందికి పైగా ట్రయినింగ్ ఇచ్చారు,అలా online ద్వారా చదువుకున్న ఎంతో మంది వివిధ దేశాలలొ వాళ్ళు స్థిరపడిన విద్యార్థులు ఉన్నారు,ఫేస్బుక్ లొ మేడమ్ గారితో పాటు వారి స్టూడెంట్స్ చేసినవి కూడా పోస్ట్ చేస్తున్నారు అందుకే ఆ యొక్క గ్రూప్ పేరు మహిళా మనోవికాస్ గా మార్చడం జరిగింది, ఈ గ్రూప్ సభ్యులు ఇప్పటివరకు 2 గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన ఘనత చోటు చేసుకున్నారు,అలా ఒకటి కాదు రెండు కాదు ప్రతి ఒక్క రంగంలో ఒక్కో అడుగును విజయంగా మార్చుకున్నారు,ఇంట్లో ఉండి కూడా ఖాళీ టైం లో Crochet వర్క్ చేసుకుంటూ ఉపాధి పొందుతూ records కూడా సాధించవచ్చు అని నిరూపించుకున్నారు,
ఈ Crochet వర్క్ వలన Stress తగ్గుతుంది మన ఇంటికి అవసరమైనవి కాకుండా order మీద కూడా చేసి ఆదాయం పొందవచ్చు ఒక స్పూర్తిదాయకంమైన సలహా ఇచ్చారు,మేడంగారి దగ్గర నేర్చుకున్న వాళ్లలో డాక్టర్స్, సాఫ్ట్వేర్ ఇజనీర్లు ఆ పై స్థాయి వ్యక్తులు ఇలా అన్ని రంగలవాళ్ళు ఉన్నారు,ఇప్పటి వరకు మేడమ్ గారికి వచ్చిన కళలతో 7 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించారు అంటే చాలా గొప్ప విషయం
కాలేజ్ రోజుల్లో జెమిని TV ప్రజావేదిక ప్రోగ్రాం లో అంతాక్షరి ప్రోగ్రాంలో ఫైనల్స్ లో రన్నర్ గా వచ్చారు, ఈటీవీ2 పరిపూర్ణ మహిళా కార్యక్రమంలో Top 10 లో ఉన్నారు,అనేక సంగీత కార్యక్రమాలలో విజేత గా,విజయానికి చిరునామాగా నిలచారు, ఒక పేరు పొందిన Beautician గా 10 years పార్లల్ రన్ చేశారు,సంగీతం,Terrace Gardening మేడంగారి అలవాట్లు ,ఒక వైపు లక్ష్యాన్ని చేరుకొవడం,ఇంకో వైపు నచ్చినవి చేస్తూ జీవితాన్ని సంతోషంగా సాగిస్తూ ఎక్కడా రాజీ పడలేదు ,అనుకున్నవి నేరవరడానికి ఒక మంచి పునాది ముఖ్యం అని చాలా చక్కగా తెలుసుకొని అడుగులు వేశారు,
మనకి వచ్చిన విద్య నలుగురికి ఉపయోగపడడం అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది అని మాధవి మేడం గారి బావిస్తారు,.
శ్రమ ,పట్టుదల,అనుకున్నవి నెరవేరాలంటే సహనం ఎంతో కావాలి అనడానికి మాధవి మేడంగారు మనకి ఎంతో ఆదర్శం,ఇలాంటి ఆలోచనలు కలిగిన అధ్భుతమైన వ్యక్తులను సమాజానికి పరిచయం చెయ్యడానికి మీ మనవాయిస్ ఎప్పుడూ ముందు ఉంటుంది...