khairatabad and Balapur Ganesh Immersion Updates 2022

The procession of Sripanchamukha Mahalakshmi Ganapati, which was celebrated in Khairatabad, will begin shortly. Mahaganapati, who received special pujas for nine days, will reach Gangamma's lap in a few hours. After the final poojas, Ganasathan will be loaded on the trolley shortly. All the Telugu people in Telugu states and abroad are eagerly waiting for the immersion of a huge number of people in Khairatabad. Directly and indirectly lakhs of devotees witness the immersion ceremony. Khairatabad Mahaganapati, which weighs about 70 tons, is being used as a state-of-the-art trolley vehicle. This Mahaganapati is going to be immersed near Crane No. 4 on NTR Marg. The Khairatabad Utsav Committee has made a 50 feet clay statue for the first time in the 67-year history of the Utsav Committee. Last year, the High Court ordered that Plaster of Paris statues not be immersed in Hussainsagar. Khairatabad Utsava Committee stopped the Plaster of Paris statue this time saying that everyone should put clay idols.

Telugu Version

ఖైరతాబాద్లో కొలువుదీరిన శ్రీపంచముఖ మహాలక్ష్మి గణపతి శోభాయాత్ర మరికాసేపట్లో ప్రారంభం కానుంది. తొమ్మిది రోజులపాటు విశేష పూజలు అందుకున్న మహాగణపతి మరికొన్ని గంటల్లో గంగమ్మ ఒడికి చేరనున్నాడు. తుది పూజల అనంతరం గణనాథుడిని మరి కాసేపట్లో ట్రాలీపైకి ఎక్కించనున్నారు. ఖైరతాబాద్ భారీ గణనాధుడి నిమజ్జనం కోసం.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవిదేశాల్లో ఉన్న తెలుగువారంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది భక్తులు నిమజ్జన వేడుకను చూసి తరిస్తారు. సుమారు 70 టన్నుల బరువున్న ఖైరతాబాద్ మహాగణపతిని.. అత్యాధునిక ట్రాలీ వాహనాన్ని వినియోగిస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నెంబర్ 4 దగ్గర ఈ మహాగణపతి నిమజ్జనం కానుంది. 67 సంవత్సరాల ఉత్సవ కమిటీ చరిత్రలోనే తొలిసారి 50 అడుగులు మట్టి విగ్రహాన్ని తయారు చేసింది ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ. ప్లాస్టర్ ఆప్ పారిస్ విగ్రహాలను హుస్సేన్సాగర్లో నిమజ్జనం చేయొద్దని గతేడాది హైకోర్ట్ ఆదేశించింది. అందరూ మట్టి విగ్రహాలే పెట్టాలనే సందేశాన్ని చెప్తూ.. ఈ సారి ప్లాస్టర్ ఆప్ పారిస్ విగ్రహానికి స్వస్తి పలికింది ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens