Telangana for students who are under extreme stress regarding exams and resultsThe intermediate board took a crucial decision. 'Tele-manus' services have been made available to fill the mental stability of the students. The services of psychologists will be provided under the name 'Tele-Manas'. The Inter Board said that these tele-manus services will help the Inter students to overcome the mental stress. The Secretary of the Inter Board has issued a statement to this effect.
The Inter Board said that there is a possibility of getting stressed in the wake of Inter exams and results, such people can call 'Tele-Manus' and take counseling with experts. Toll free number 14416 has been announced for this purpose. Inter board secretary said that you can call this number and consult psychiatrists for free. Moreover, he said that free psychologist consultation facility is being provided to inter students and parents in government hospitals as well.
Telugu version
పరీక్షలు, ఫలితాల విషయంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతురన్న విద్యార్థుల కోసం తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్లో మానసిక స్థైర్యాన్ని నింపేందుకు ‘టెలి-మానస్’ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ‘టెలి-మానస్’ పేరుతో సైకాలజిస్టుల సేవలు అందించనుంది. ఇంటర్ విద్యార్థులు మానసిక ఒత్తిడిని జయించేందుకు ఈ టెలి మానస్ సేవలు ఉపకరించనున్నాయని ఇంటర్ బోర్డు తెలిపింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి ప్రకటన విడుదల చేశారు.
ఇంటర్ పరీక్షలు, ఫలితాల నేపథ్యంలో ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని, అలాంటి వారు ‘టెలి-మానస్’కు కాల్ చేసి నిపుణులతో కౌన్సిలింగ్ తీసుకోవచ్చని ఇంటర్ బోర్డు పేర్కొంది. ఇందుకోసం టోల్ ఫ్రీ నెంబర్ 14416 ప్రకటించింది. ఈ నెంబర్‌కు కాల్ చేసి ఉచితంగా మానసిక వైద్యులను సంప్రదించవచ్చునని ఇంటర్ బోర్డు కార్యదర్శి పేర్కొన్నారు. అంతేకాదు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ఇంటర్ విద్యార్థులు, పేరెంట్స్‌కి ఉచితంగా సైకాలజిస్ట్ కన్సల్టేషన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.