పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారంగా భారత ఆర్మీ చర్యలు ప్రారంభించింది. ఈ దాడిలో పాల్గొన్న ప్రధాన నిందితుల్లో ఒకడైన టెర్రరిస్ట్ ఆదిల్ షేక్ ఇంటిని భద్రతా బలగాలు శక్తివంతమైన ఐఈడీతో ధ్వంసం చేశాయి.
ఈ నేపథ్యంలో బిజ్ బెహరా, త్రాల్ ప్రాంతాల్లో సైన్యం ముమ్మర కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే వాసస్థలాలపై దాడులు కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది.
గత మంగళవారం జరిగిన ఈ దారుణ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో కలకలం రేపింది. ఈ ఘటన వెనుక పాకిస్థాన్‌కు మద్దతు ఉన్న ఉగ్రసంస్థల హస్తం ఉన్నట్లు కేంద్రం తీవ్రంగా ఆరోపించింది. దాంతో పాటు భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగినట్టు తెలుస్తోంది. భారత్ ఆదేశించిన ఆంక్షలపై ప్రతిగా పాకిస్థాన్ కూడా తనదైన మార్గంలో స్పందించడంతో, పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది.